తెలంగాణ

విమోచన దినోత్సవం నిర్వహణకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిన బిజెపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 16: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్రప్రభుత్వమే నిర్వహించాలని బిజెపి ఒత్తిడితో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. విమోచన దినోత్సవం పేరుతో గత నెల రోజులుగా పెద్ద ఉద్యమమే నడిపిన బిజెపి ఈ నెల 17 రాష్ట్ర పార్టీకార్యాలయంలో భారీ ఎత్తున సమావేశాన్ని నిర్వహించడంతో పాటు సాయంత్రం నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్స్‌లో సంకల్ప సభ నిర్వహించనుంది. తెలంగాణ విముక్తికి బలిదానాలు చేసిన అమరులు త్యాగాలను స్మరించుకుంటూ నాటి స్వాతంత్య్ర పోరాటాల విశిష్టతను ప్రజలకు తెలియజేస్తారు. గ్రామ గ్రామాన బిజెపి నాయకులు, ప్రజలు పోలింగ్ బూత్ వారీగా జాతీయ జండాను ఎగురవేయనున్నారు. విమోచన దినోత్సవ సభలో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుండి బయలుదేరి ఒంటి గంటకు హైదరాబాద్ బేగంపేటకు చేరుకుంటారు. మధ్యాహ్నం రెండు గంటలకు నిజామాబాద్ చేరుకుని సంకల్పసభలో పాల్గొంటారు. విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం 8.30కి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పతాకావిష్కరణ నిర్వహించి అసెంబ్లీ ఎదురుగా ఉన్న సర్దార్ పటేల్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పిస్తారు. నరేంద్రమోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని మెడికల్ క్యాంపు నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు జరిగే రాజ్‌నాధ్ సింగ్ సభకు రాష్ట్ర నేతలు పయనమవుతారు.
న్యాయం చేయండి
గోవిందరావుపేట గిరిజనులపై దౌర్జన్యానికి పాల్పడిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ శనివారం నాడు డిమాండ్ చేశారు.
జాతీయ కార్మిక దినోత్సవం
విశ్వకర్మ జయంతి ఉత్సవాల సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జాతీయ కార్మిక దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ అనేక రంగాల్లో కార్మికుల పాత్ర ఎనలేనిదని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వాలు పనిచేయాలని అన్నారు.
ఈ కార్యక్రమానికి కన్వీనర్ ఎ ప్రభు అధ్యక్షత వహించారు. ఇందులో బండారు దత్తాత్రేయ, కృష్ణ మూర్తి తదితర నేతలు పాల్గొన్నారు.