తెలంగాణ

20న బిసి యువజన మహాసభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: ఈ నెల 20న బిసి యువజనుల మహాసభ నిర్వహిస్తున్నట్లు బిసి సంక్షేమ సంఘం తెలంగాణ శాఖ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బిసిలకు సామాజిక న్యాయం-సమాన వాటా దక్కాలనే ప్రధాన డిమాండ్‌తో 20 తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బిసి యువజన మహాసభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మహాసభ వాల్‌పోస్టర్‌ను జాజుల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాసభకు అఖిల పక్ష నేతలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. 31 జిల్లాల నుంచి బిసి యువజనులు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథులుగా బిసి సంక్షేమ మంత్రి జోగు రామన్న, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు, పొన్నం ప్రభాకర్, టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ తదితరులును ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. బిసిలకు రూ.20 వేల కోట్లతో సబ్‌ప్లాన్ ఏర్పాటు చేసి, చట్టసభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బిసి సబ్‌ప్లాన్ ఏర్పాటుకు మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.