తెలంగాణ

నిజాంను తలపిస్తున్న కెసిఆర్ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పాలన నిజాం పాలనను తలపిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న కెసిఆర్ పాలనపై ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం నాడిక్కడ బంజారాహిల్స్‌లోని రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ అమర వీరుల స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో హైదరాబాద్ రాష్ట్రం భారత దేశంలో విలీనం 69వ వార్షికోత్సవాల సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
ఈ సభకు ట్రస్టు అధ్యక్షుడు బూర్గుల నర్సింగ్‌రావు అధ్యక్షత వహించగా కార్యదర్శి కందిమళ్ల ప్రతాప్‌రెడ్డి స్వాగతోపన్యాసం చేశా రు. సెప్టెంబర్ 17 విమోచన దిన మా..?, విద్రోహ దినమా..? అన్న విధానానికి స్వస్తి చెప్పి, స్వాతంత్య్ర దినంగా గుర్తించి కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవంగా గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. బిజెపి నాయకత్వ తీరుపై ఆయన మండిపడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఎలాంటి సంబంధం లేని బిజెపి చరిత్రను వక్రీకరించి అబద్దాలు ఆడుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు, సయ్యద్ అజీజ్ పాషా, గుండా మల్లేష్, ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడారు.

చిత్రం..సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చాడ