తెలంగాణ

హోంగార్డు కుటుంబాన్ని ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: కామారెడ్డి జిల్లాలో నిరుపేద కుటుంబానికి చెందిన హోంగార్డు జంగం శివశేఖర్ ఆత్మహత్య చేసుకున్నందున ఆ కుటుంబం రోడ్డున పడకుండా ప్రభుత్వం ఆదుకోవాలని సిఎం కెసిఆర్‌ను తెలంగాణ సిపిఐ ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కోరారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేక హోంగార్డు ఉద్యోగం చేస్తున్నాడని తెలిపారు. అనేక మంది సర్వీస్‌లను క్రమబద్దీకరిస్తామన్న హామీ మేరకు హోంగార్డుల సర్వీసును కూడా క్రమబద్దీకరించాలని సిఎంను కోరారు. అలాగే మరణించిన హోంగార్డు శివశేఖర్ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, పిల్లలకు ఉచిత విద్య, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
సివి చారి మృతి పట్ల సంతాపం
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, గాంధేయ వాది, భూదాన యజ్ఞ బోర్డు మాజీ చైర్మన్ సివి చారి మరణం పట్ల చాడ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. చారి మృతి రాష్ట్రానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక, రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 19న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 11 గంటలకు రాష్ట్ర భూ సదస్సు జరుగుతుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ప్రసాద్, ఆర్.వెంకట్రాములు తెలిపారు. దళితులు, బలహీనవర్గాలు, వెనుకబడినవారికి భూముల కేటాయింపు, వసతి వంటి వాటిని సమకూర్చాలని డిమాండ్ చేస్తూ ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు. ఈ సదస్సులో 10 వామపక్ష పార్టీల రాష్ట్ర కార్యదర్శులు పాల్గొంటారని వారు ఒక ప్రకటనలో తెలిపారు.