తెలంగాణ

ప్రజల ఇబ్బందులు పట్టవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో ముడిపడిన విమోచన దినోత్సవానికి సంబంధించి ప్రభుత్వ మొద్దు నిద్రను తట్టిలేపేందుకు బిజెపి ప్రయత్నించిందని డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టడం లేదని ఆయన అన్నారు. నిజామాబాద్‌లో రాజ్‌నాధ్ సింగ్ సంకల్ప సభను విజయవంతం చేసి స్పష్టమైన సంకేతాన్ని ప్రజలు ప్రభుత్వానికి ఇచ్చారని అన్నారు. ఎందుకు నిర్వహించలేకపోతున్నారో స్పష్టంగా అధికారపూర్వకంగా చెప్పలేకపోవడాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నాన్ని మంత్రులు చేసినా, ప్రజల నుండి సంపూర్ణ మద్దతు తమకు లభించిందని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్ల పెరుగుతున్న అసంతృప్తి బహాటంగా కనిపించిందని అన్నారు.
సంకల్ప సభకు ప్రజలు అండగా నిలిచారని, స్వాతంత్య్ర సమరయొధులు , వారి కుటుంబ సభ్యులను స్మరించుకున్నామని అన్నారు. రాం మాధవ్ ఈశాన్య రాష్ట్రంలో పార్టీ పటిష్టానికి కృషి చేస్తున్నారని అన్నారు. ఉత్తర తెలంగాణలో ఐదు పార్లమెంటు స్థానాల్లో బిజెపి గెలుపు నిమిత్తం అదనంగా ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించారని అన్నారు. తెలంగాణలోని కరీంనగర్, జహీరాబాద్, మెదక్‌లకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశం జరిపి, రాబోయే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సాధించేందుకు సమీక్ష నిర్వహించారని అన్నారు.
నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలను సైతం ఆయన సమీక్షిస్తారని పేర్కొన్నారు. కంచె ఐలయ్య సమాజంలో అశాంతిని సృష్టించడం భావ్యం కాదని, కొన్ని కులాలను కించపరచడం ఏ విధంగానూ సమర్ధనీయం కాదని లక్ష్మణ్ పేర్కొన్నారు. జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాపైనా, ప్రధాని నరేంద్రమోదీని సైతం ఐలయ్య దూషించడం సహించరానిదని అన్నారు. కులాల పేరుతో పబ్బం గడపాలని చూడటం సరికాదని అన్నారు. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ పేరుతో అన్ని వర్గాలను సమ దృష్టితో చూస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా పనిగట్టుకుని వ్యాఖ్యలు చేయడం ఏ మాత్రం భావ్యం కాదని లక్ష్మణ్ అన్నారు. ప్రభుత్వం కూడా ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.