తెలంగాణ

ఏడాదిలోగా కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌ల ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: ఈ ఏడాదిలోగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని డివిజన్లలోగల అన్‌మాన్డ్ లెవెల్ క్రాసింగ్ గేట్లను ఎత్తివేయనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు. ఆ దిశగా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. సోమవారం సికిందరాబాద్‌లోని రైల్ నిలయంలో రైల్వే అధికారులతో ఆయన సమావేశమయ్యారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఆరు డివిజన్లలో రైల్వే క్రాసింగ్ గేట్లను ఎత్తివేసే పనులను వేగవంతం చేయాలని, రైల్వే ఆస్తుల భద్రత, ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగు పరచడమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని, రైళ్ల సమయ పాలన, ట్రాక్‌ల సంరక్షణ బాధ్యతకు ప్రాధాన్యమిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, కాపలా లేని రైల్వే క్రాసింగ్‌ల భద్రతకు సంబంధించి పెట్రోలింగ్ వంటి పనులను ఎప్పటికప్పుడు సిబ్బందితో సమన్వయంగా పరిశీలించాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ జాన్ థామస్, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనర్ కెవి శివప్రసాద్, చీఫ్ ఆపరేటర్ మేనేజర్ ఎన్ మధుసూదనరావు, చీఫ్ మెకానికల్ ఇంజనీర్ అర్జున్ ముండియా, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్స్ చీఫ్ ప్రిన్సిపల్ మోహన్ శ్రీవాస్తవ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సికిందరాబాద్‌లోని రైల్ నిలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో
మాట్లాడుతున్న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్