తెలంగాణ

అవయవదానం చేసిన ప్రాణదాతలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ ఖైరతాబాద్, సెప్టెంబర్ 18: వేర్వేరు సంఘటనల్లో మరణానికి చేరువైన ఇద్దరు అవయవదానం చేసి ఇతరుల ప్రాణాలను నిలబెట్టారు. ఓల్డ్ మలక్‌పేట, ప్రేమలతనగర్‌కు చెందిన శ్రీనివాసరావు (45) టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈనెల 15న మధ్యాహ్నం షాప్ నుంచి భోజనం చేసేందుకు ఇంటికి వచ్చిన శ్రీనివాసరావుకు భోజనం అనంతరం బిపి పెరగడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తరలించగా వారు మెరుగైన చికిత్సల నిమిత్తం మలక్‌పేటలోని యశోద ఆసుపత్రికి తరలించారు. అతన్ని పరిశీలించిన వైద్యుల బృందం శ్రీనివాసరావు బ్రెయిన్‌డెడ్ అయినట్టు నిర్ధారించారు. ఈ విషయాన్ని జీవన్‌దాన్ సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది అతని కుటుంబ సభ్యులకు అవయవదానం అవశ్యకతను వివరించడంతో వారి సమ్మతితో అతనికి ప్రత్యేక శస్తచ్రికిత్స నిర్వహించి లివర్, రెండు కార్నియాలను సేకరించి అవసరమైన వారికి అమర్చారు. ఇదే తరహాలో తీవ్ర రక్తపోటుకు గురైన మందమర్రి, మంచిర్యాలకు చెందిన కే.రాజ్‌కుమార్ (50) ఈనెల 13న ఇంట్లో పడిపోయాడు. వెంటనే అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు నగరంలోని గ్లోబల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. రెండు రోజులు చికిత్సలు అందించినా ఆయన ఆరోగ్యం మెరుగుపడక పోవడంతో వైద్యుల బృందం పూర్తిస్థాయిలో పరీక్షించగా రాజ్‌కుమార్ బ్రెయిన్‌డెడ్‌కు గురైనట్టు నిర్ధారించారు. దీంతో జీవన్‌దాన్ బృందం అతని భార్య గోవిందమ్మకు అవయవదానం విశిష్టతను వివరించడంతో అవయవాలు దానం చేసేందుకు ఒప్పుకుంది. శస్తచ్రికిత్స నిర్వహించి లివర్, రెండు కార్నియాలను సేకరించి అవసరమైన వారికి అమర్చారు.

చిత్రాలు.. శ్రీనివాస రావు *రాజ్‌కుమార్