తెలంగాణ

ప్రపంచ స్థాయి వర్సిటీగా ఉస్మానియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: ఉస్మానియా యూనివర్శిటీని ప్రపంచస్థాయి వర్శిటీగా తీర్చిదిద్దుతామని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం పేర్కొన్నారు. మంగళవారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ యూనివర్శిటీ అభివృద్ధికి 20 ఏళ్ల ప్రణాళిక రూపొందించుకుంటున్నామని, తొలి పదేళ్లలో ప్రపంచస్థాయి యూనివర్శిటీగా ఎదిగేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. అఖిలభారత లక్షణాలు, అంతర్జాతీయ ప్రమాణాలు అందుకోవల్సి ఉందని చెప్పారు. యుజిసి రూపొందించిన కొత్త పథకం ప్రకారం ఎమినెన్స్ స్టాటస్ (పేరుప్రతిష్టలున్న విశ్వవిద్యాలయ హోదా) కోసం ఉస్మానియా యూనివర్శిటీ సైతం పోటీ పడుతుందని పేర్కొన్నారు. ఎన్‌ఐఆర్‌ఎఫ్ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో తొలి 50 ర్యాంకుల్లో ఉన్న వర్శిటీలు పేరు ప్రతిష్టలున్న విశ్వవిద్యాలయాల హోదాకు పోటీ పడే వీలుందని అన్నారు. ఈ హోదా రానున్న రోజుల్లో 20 ఉన్నత విద్యాసంస్థలకు దక్కుతుందని ఆయన చెప్పారు. ఆ హోదా లభిస్తే నియంత్రణ సంస్థల చట్రం నుండి బయటపడేందుకు వీలు దక్కుతుందని అన్నారు. రాష్ట్రాల ఆధీనంలోని వర్శిటీలకు రానున్న పదేళ్లలో 10వేల కోట్ల రూపాయిలు అదనంగా లభిస్తాయని ఇది యూనివర్శిటీల అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని అన్నారు. నేక్ ఉస్మానియా యూనివర్శిటీకి ఎ ప్లస్ గ్రేడింగ్ ఇచ్చిందని, దీనివల్ల వర్శిటీ స్థాయిత్వం పెరిగిందని అన్నారు. తెలంగాణలో కేవలం ఉస్మానియాకు మాత్రమే ఎ ప్లస్ గ్రేడ్ దక్కిందని , మిగిలిన వర్శిటీలకు మార్గదర్శకంగా నిలిచిందని అన్నారు. నేక్ బృందం తనిఖీ సందర్భంగా చేసిన సూచనలను దృష్టిలో ఉంచుకుని తదనుగుణంగా చర్యలు చేపట్టామని తెలిపారు. ఎ ప్లస్ హోదాను ఏడేళ్ల కాలానికి దేశంలో కేవలం ఉస్మానియా యూనివర్శిటీకి మాత్రమే నేక్ బృందం కల్పించిందని ఆయన వివరించారు. ఇటీవల ఉస్మానియా శతజయంతి ఉత్సవాలతో పాటు అనేక విజయాలు సాధించిందని ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో దాదాపు 72 కోట్ల వ్యయంతో అధునాత సౌకర్యాలతో హాస్టళ్ల నిర్మాణం చేపడతామని ఆయన వెల్లడించారు.