తెలంగాణ

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై జిఎస్‌టి ప్రభావం నామమాత్రమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: డబుల్ బెడ్‌రూబ్ ఇళ్లపై జిఎస్‌టి ప్రభావం అంతగా ఉండదని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కాంట్రాక్టర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండ్రస్టీ (ఎఫ్‌టాప్సీ) ఆధ్వర్యంలో ‘డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు-జిఎస్‌టీ’ ప్రభావంపై మంగళవారం జిల్లా నోడల్ అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు అవగాహన కల్పిస్తూ చిత్రారామచంద్రన్ వివరించారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ, జిఎస్‌టి అమలులోకి రాకముందు ప్రారంభమైన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు వాట్ ప్రకారం చెల్లింపులు ఉండటంతో జిఎస్‌టి ప్రభావం ఉండదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి ఒక్క యూనిట్‌కు రూ.5.04 లక్షలు కాగా, వ్యాట్ అమలులో ఉన్నప్పుడు ఇంటి నిర్మాణ విలువ రూ.4.80 లక్షలు ఉంటే మిగితా రూ.24 వేలు వాట్ చెల్లింపులు ఉంటాయన్నారు. అయితే కాంట్రాక్టర్‌కు నిర్మాణ సామాగ్రి కొనుగోలుపై 5 శాతం నుంచి 8 శాతం ఇన్‌ఫుట్ క్రెడిట్ వస్తుందన్న అంచనాతో ఈ పన్ను మొత్తాన్ని నిర్ణయించినట్టు వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు రూ.4.80 లక్షల చెల్లింపులకుగానూ 5 శాతాన్ని టిడిఎస్ కింద ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ సాఫీగా జరిగేందుకు జిల్లా నోడల్ అధికారులు జిఎస్‌టి నిబంధనల ప్రకారం చెల్లింపుదారునిగా, మినహాయింపుదారునిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు.
జిల్లా స్థాయిలో మానిటరింగ్ సిస్టమ్
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ప్రాజెక్ట్ మానిటరింగ్ సిస్టమ్ (పిఎంఎస్) ఏర్పాటు చేసినట్టు చిత్రా రామచంద్రన్ తెలిపారు. నిధుల కొరత లేకుండా చూడటం, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామన్నారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పర్యవేక్షించే బాధ్యత పిఎంఎస్‌దేనని ఆమె స్పష్టం చేశారు. నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు భవిష్యత్‌లో ఎలాంటి ఆడిట్ ఇబ్బందులు లేకుండా జవాబుదారీతనంగా, పారదర్శకంగా ఉండాలని చిత్రా రామచంద్రన్ ఆదేశించారు.