తెలంగాణ

ఎట్టకేలకు కార్మికుల మృతదేహాల వెలికితీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంపల్లి, ఏప్రిల్ 16: ఈనెల 13న మధ్యాహ్నం 1.30గంటల ప్రాంతంలో బెల్లంపల్లిలోని శాంతిఖని బొగ్గు గనిలో 52వ లెవెల్ 1వ జంక్షన్ వద్ద బొగ్గు గని పై కప్పు కూలిన సంఘటనలో కార్మికులు పొలసాని హన్మంతరావు, గాలిపెల్లి పోశం, రణవత్ కిష్టయ్యలు మృతిచెందారు. వీరి మృతదేహాలు 67 గంటల పాటు బండకింది శిథిలాల్లోనే ఉన్నాయి. బుధవారం మద్యాహ్నం 2.30గంటలకు సింగరేణి ప్రాజెక్టు ప్లానింగ్ డైరెక్టర్ మనోహర్ రావు పర్యవేక్షణలో ఆరు టీమ్‌లుగా 90మంది రెస్క్యూ సిబ్బంది 67గంటల పాటు శ్రమించి కార్మికుల మృతదేహాలను ఒక్కొక్కటిగా శనివారం ఉదయం వరకు బయటికి తీసుకువచ్చారు. హన్మంతరావు మృతదేహాన్ని 48గంటల్లో బయటికి తేగా, మరో ఇద్దరు కార్మికులు కిష్టయ్య, పోశం మృతదేహాలను 67గంటల అనంతరం బయటికి తీశారు. ఈ మృతదేహాలను పోలీసు పహారా మద్య సింగరేణి ఏరియాస్పత్రికి తీసుకువచ్చి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాలను మృతుల కుటుంబాలకు అప్పగించారు. అనంతరం డైరెక్టర్ పిపి మనోహర్ రావు, జీ ఎంలు వెంకటేశ్వర్ రెడ్డి మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెక్కును అందజేశారు.
శోకసంద్రమైన నెంబర్-2 ఇంక్లైన్, సుభాష్‌నగర్ కాలనీలు...
శాంతిఖని బొగ్గు గని ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురు కార్మికుల మృతదేహాలను శనివారం వెలికి తీసి కుటుంబీలకు అప్పగించడంతో వారు నివసిస్తున్న నెంబర్-2 ఇంక్లైన్, సుభాష్‌నగర్ కాలనీలకు వారి ఇండ్లకు మృతదేహాలను తేవడంతో కాలనీ ప్రజలు, కార్మికులు వందలాదిగా తరలి వచ్చి బోరున విలపించారు.