తెలంగాణ

రాజధానికి గోదారి నీళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంద్రాయణగుట్ట, నవంబర్ 27: జంట నగరవాసుల దాహర్తి తీర్చేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నంతో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో గోదావరి నీళ్లు కుత్బుల్లాపూర్‌కు చేరుకున్నాయి. ఘన్‌పూర్‌కు నుంచి కుత్బుల్లాపూర్‌కు చేరుకున్న 28.5 ఎంజిడిల నీటిని ఆన్‌లైన్ ద్వారా సరఫరా ప్రారంభించారు. గోదావరి నుంచి తీసుకొస్తున్న నీటిని రెండు రింగ్‌మెయిన్‌ల కింద జలమండలి అధికారులు తరలిస్తున్నారు. రింగ్‌మెయిన్-1లో భాగంగా లింగంపల్లి రిజర్వాయర్‌కు, రింగ్‌మెయిన్-2లో సైనిక్‌పురిలోని రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తున్నారు. మంజీరా నీటి సరఫరాకు సంబంధించిన పైప్‌లైన్‌ను తొలగించి గోదావరి నీటిని లింగంపల్లికి తరలించే పైప్‌లైన్, జంక్షన్ వర్కులను జలమండలి ప్రాజెక్ట్ విభాగం అధికారులు చేపడుతున్నారు. తాజాగా ఘన్‌పూర్ నుంచి నగరానికి తీసుకొచ్చిన గోదావరి జలాలను జీడిమెట్ల వాణీ కెమికల్ ప్రాంతంలోవున్న ఇఎల్‌ఎస్‌ఆర్ రిజర్వాయర్‌కు తరలించారు. అక్కడే జంక్షన్ వర్కులు చేపట్టి దాదాపు 28.5 ఎంజిడిల నీటిని పంపింగ్ ద్వారా జలమండలి డివిజన్-12 మెయింటనెన్స్ విభాగం పరిధిలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేశారు. శుక్రవారం నాలుగు గంటల ప్రాంతంలో జీడిమెట్లకు చేరుకున్న నీటిని రాత్రి వరకూ ఆన్‌లైన్ ద్వారా కుత్బుల్లాపూర్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నీటిని సరఫరా చేస్తున్నట్టు జలమండలి అధికారులు తెలిపారు. ఘన్‌పూర్ నుంచి నగరానికి చేరుకున్న నీటిని రింగ్‌మెయిన్-1 కింద లింగంపల్లి రిజర్వాయర్‌కు తరలించాల్సి ఉంది. అయితే, లింగంపల్లి, ఉషా ముళ్లపూడి, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో గోదావరి జలాల తరలింపు అనుసంధాన పనులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జీడిమెట్ల వద్దే జంక్షన్ వర్కులు పూర్తిచేసి ఇఎల్‌ఎస్‌ఆర్ రిజర్వాయర్‌కు తరలించారు. ఇక్కడి నుంచి మొదటి దశ కింద గోదావరి నీళ్లను ఆన్‌లైన్ ద్వార సరఫరా చేసిన్నట్టు జలమండలి అధికారులు తెలిపారు.
హైదరాబాద్ మహానగర తాగు నీటి అవసరాల కోసం 2007లో అప్పటి ప్రభుత్వం రూ.3375 కోట్లతో వౌలానా అబ్దుల్ కలాం సుజల స్రవంతి పథకాన్ని చేపట్టింది. ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ శివారు ప్రాంతాలకు 186 కిలోమీటర్లు మేర పైప్‌లైన్ నిర్మాణం చేపట్టారు. వీటిద్వారా రోజు 175 ఎంజిడిల నీటిని సరఫరా చేసేలా రూపకల్పన చేశారు. పథకాన్ని పర్యవేక్షించిన జలమండలి అధికారులు అక్టోబర్ 27న ఎల్లంపల్లి నుంచి బొమ్మకల్ వరకు ట్రయల్ రన్ నిర్వహించిన తరువాత మల్లారం, కొండపాక తదితర ప్రాంతాల ద్వారా విజయవంతంగా గోదావరి జలాలను నగరానికి తరలించారు. ఎల్లంపల్లి బ్యారేజీ నుండి నాలుగు దశల్లో నగరానికి నీటిని తరలిస్తున్నారు. ఈనెల 24న కరీంనగర్, ప్రజ్ఞాపూర్ మీదుగా తుర్కపల్లి, ఘన్‌పూర్ వరకు గోదావరి జల్లాలు చేరుకున్నాయి. గోదావరి ప్రాజెక్ట్‌లో భాగంగా మొదటి విడత కింద నగరానికి రావల్సిన 48 ఎంజిడిల్లో ప్రస్తుతం 28 ఎంజిడిలను జలాలు తీసుకువచ్చారు. శుక్రవారం జీడిమెట్లకు చేరిన జలాలను స్థానిక ఎమ్మెల్యే వివేక్‌తోపాటు జలమండలి అపరేషన్ విభాగం డైరెక్టర్ జి రామేశ్వరరావు పరిశీలించారు. కార్యక్రమంలో పలు డివిజన్‌లకు చెందిన జలమండలి జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.

చిత్రం.. కుత్బుల్లాపూర్‌కు చేరుకున్న గోదావరి జలాలు