తెలంగాణ

పాడిపరిశ్రమలో 110 పోస్టుల భర్తీకి అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: తెలంగాణ రాష్ట్ర పాడి అభివృద్ధి సంస్థ ఫెడరేషన్‌లో ఖాళీగా ఉన్న 110 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్. శివశంకర్ పేరుతో ఉత్తర్వులు వెలువడ్డాయి. అసిస్టెంట్ డెయిరీ మేనేజర్/మేనేజర్ గ్రేడ్-2 కు సంబంధించిన ఐదు పోస్టులతో పాటు అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్లు (మెకానికల్, సివిల్), ప్రాసెసింగ్ సూపర్‌వైజర్లు, ఫీల్డ్ సూపర్‌వైజర్లు, సూపర్‌వైజర్ (మార్కెటింగ్), ప్లాంట్ మెకానిక్స్, మార్కెటింగ్ అసిస్టెంట్స్, ఫీల్డ్ అసిస్టెంట్స్, లాబ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేసేందుకు సంబంధిత ఉన్నతాధికారి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ జీఓ ద్వారా ఆదేశించారు.