తెలంగాణ

మరో 24 గంటల పాటు భారీ వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: తెలంగాణలోని వేర్వేరు ప్రాంతాల్లో వచ్చే 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. నైరుతీ రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని, ఈ ప్రభావం తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంటుందని ఐఎండి హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ (ఇంచార్జి) వైకె రెడ్డి తెలిపారు. గత మూడు రోజుల నుండి రాజధాని హైదరాబాద్‌తో పాటు వేర్వేరు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షపాతం నమోదవుతోంది.
రాష్టర్రాజధానిలోని వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు ట్రాఫిక్ రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.
గత 24 గంటల్లో నవాబ్‌పేట్‌లో 10 సెంటీమీటర్లు, కరీంనగర్, కోటగిరి, గంగాధరలో ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఒక మోస్తరు నుండి భారీగా వర్షం కురిసింది. వాతావరణం చల్లగామారింది. వేర్వేరు ప్రాంతాల్లో అత్యధికంగా 32 డిగ్రీల సెల్సియస్ మాత్రమే నమోదైంది.