తెలంగాణ

నేరెళ్ల ఘటనపై హైకోర్టు విచారణ 24లోగా నివేదిక ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: నేరేళ్ల ఘటనలో అభియోగాలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయడంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందో తెలియచేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంలో ప్రభుత్వం తీరు పట్ల కోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ కేసును హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్,జస్టిస్ జి గంగారావు విచారించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున న్యాయవాది ఏ సంజీవ్ కుమార్ వాదనలు వినిపిస్తూ, సెక్షన్ 324 ఐపిసి కింద ఎస్సై రవీందర్ ఇతర పోలీసులపై కేసును నమోదు చేసినట్లు కోర్టుకు తెపారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది వి రఘునాథ్ వాదనలు వినిపించారు. సిరిసిల్ల జిల్లా ఎస్పీ విశ్వజిత్‌పై కేసు నమోదు చేయాలని ఆయన కోర్టును కోరారు. ఈ కేసులో తీసుకున్న చర్యలపై ఈ నెల 24వ తేదీలోగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి అఫిడవిట్‌ను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.