తెలంగాణ

ప్రజా రవాణా బలోపేతానికి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: ప్రజారవాణా బలోపేతానికి తగు చర్యలు తీసుకోవడంపై మంగళవారం అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్ టేకింగ్స్ స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్, టిఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ జివి రమణరావు అధ్యక్షతన సమావేశం జరిగింది. బస్ భవన్‌లో జరిగిన సమావేశంలో ట్రాఫిక్, రవాణా విధానంపై ప్రతినిధులు వారివారి అభిప్రాయాలను వెల్లడించారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వ రంగ రవాణా సంస్థల నుంచి విచ్చేసిన ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో స్టాండింగ్ కమిటీ కార్యదర్శి ఉల్లా బాబు, అస్సాం ఆర్టీసీ సలహాదారు దండా మట్టాక్, కెఎస్‌ఆర్టీసీ జిఎం కెఎస్ విశ్వనాథ్, బాంబే ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ సిఎం డిఎం సుర్వే, ఏపిఎస్ ఆర్టీసి డిప్యూటీ సిటిఎం వి సుధాకర్‌లు పాల్గొన్నారు. ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేసే 1988 ఎంవి యాక్టుకు సంబంధించిన నిబంధనలపై చర్చించారు. గ్రామీణ ప్రాంతా బస్సు సర్వీసుల నిర్వహణపై, నష్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించే విధంగా కోరాలని సమావేశం తీర్మానించింది. డిజిటల్ లావాదేవీలలను పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రూ. 2500 కోట్లు లక్ష్యంగా పెంచే దిశలో దేశంలోని ఆర్టీసీలు తగిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కేంద్రంను కోరింది.