తెలంగాణ

13లోగా ఖరీఫ్ బీమా చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: 2016 ఖరీఫ్ పంటలకు సంబంధించి బీమాను అక్టోబర్ 13 లోగా పూర్తిగా చెల్లించాలని వ్యవసాయ కార్యదర్శి సి. పార్థసారథి బీమా కంపెనీల అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం ఈ మేరకు ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2016 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 154.36 కోట్ల రూపాయలు బీమాగా రైతులకు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 80 కోట్ల రూపాయలే బ్యాంకుల్లో బీమ కంపెనీలు డిపాజిట్ చేశాయని గుర్తు చేశారు. మిగతా మొత్తాన్ని ఈ నెల 13 లోగా బ్యాంకుల్లోని రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించారు.
అలాగే 2016-17 రబీ పంటలకు సంబంధించి బీమా చెల్లించేందుకు ఈ నెల 23 వరకు గడువు ఇస్తున్నామన్నారు. బీమా కంపెనీలు ఎలాంటి సాకులు చెప్పవద్దని హెచ్చరించారు. ఒకవేళ ఏదైనా బీమా కంపెనీ సకాలంలో బీమా చెల్లించకపోతే బ్లాక్ లిస్ట్‌లో పెడతామని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియచేస్తామన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ కమిషనర్ జగన్‌మోహన్, చోళా ఎంఎస్ జిఐసి, బజాజ్ అలియెన్స్, ఎస్‌బిఐ జిఐసి, రిలయన్స్ జిఐసి ప్రతినిధులతో పాటు ప్లానింగ్ డైరెక్టర్, స్టాటిస్టిక్స్ శాఖ సిఇఓ తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.