తెలంగాణ

ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికే కామన్‌వెల్త్ పార్లమెంటరీ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: ప్రపంచంలో ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడానికి నవంబరులో జరగనున్న కామన్‌వెల్త్ పార్లమెంటరీ సదస్సు-2017 దోహదపడుతుందని తెలంగాణ శాసన స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు. కామన్‌వెల్త్ పార్లమెంటరీ సదస్సు సన్నాహక సమావేశంలో మధుసూధనాచారి, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ పాల్గొన్నారు. వచ్చేనెల 1 నుంచి 8వ తేదీ వరకు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరగనున్న 63వ కామన్‌వెల్త్ పార్లమెంటరీ సదస్సు సన్నాహక సమావేశం మంగళవారం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షతన పార్లమెంట్‌లో జరిగింది.
ఈ సమావేశానికి తెలంగాణ శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్, శాసనసభ సెక్రటరీ నర్సింహాచారి హాజరయ్యారు. అనంతరం మధుసూదనాచారి మాట్లాడుతూ 63వ కామన్‌వెల్త్ పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో పాల్గొనడం అరుదైన గౌరమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున విలువైన సూచనలు, తీసుకోవాల్సి చర్యలపై ఒక ప్రణాళికతో ధాకా వెళ్తామని ఆయన చెప్పారు. స్వామిగౌడ్ మాట్లాడుతూ కామన్‌వెల్త్ సదస్సు చట్టసభల గౌరవాన్ని మరింత పెంచడంతోపాటు దేశ ప్రగతిలో చట్టసభల పాత్రను ప్రజలకు తెలిసేలా కొనసాగుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.