తెలంగాణ

జిల్లాల పునర్‌వ్వవస్థీకరణతో అభివృద్ధి పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రిగా కెసిఆర్
తాగు, సాగునీరు అందించడమే సిఎం స్వప్నం
ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ

వనపర్తి, అక్టోబర్ 11: రాష్ట్రంలో జిల్లాల విభజనతో అభివృద్ధి పరుగులు తీస్తోందని ఉపముఖ్యమంత్రి మహిమూద్ అలీ అన్నారు. బుధవారం వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన టిఆర్‌ఎస్ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిధిగా మాట్లాడారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో దేశంలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ నెంబర్ 1గా నిలిచారని ఆయన అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాలు సుఖసంతోషాలతో ఉండాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశమని అన్నారు. ప్రజలకు, రైతులకు తాగు, సాగునీరు అందించాలన్నదే సిఎం స్వప్నమని ఆయన అన్నారు. అన్ని రంగాల్లో వెనుకబడిన పాలమూరు జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు, వలసలను నివారించేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి వేగంగా పనులు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికే కాల్వల ద్వారా చెరువులను నింపడం అంతకముందే మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పూడికతీయడం, ఏడాదికి ఎకరాకు రూ.8 వేలు రైతులకు పెట్టుబడి కోసం అందించి దేశంలోనే ఎవరూ చేయలేని సాహసం ముఖ్యమంత్రి చేశారని, ఆయన తెలంగాణ టైగర్ అని అన్నారు. ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చాకా కూడా కుట్ర లు జరుగుతున్నాయని, దీనిని ప్రజలు గమనించాలని అన్నారు. చివరి నిమిషం వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా అడ్డుపడ్డారని, రాష్ట్రం ఏర్పా టు అయ్యాకా ప్రాజెక్టులను నిర్మించి అభివృద్ధి సాధించాలన్ని చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు కోర్టులకు వెళ్తున్నారని ఆయన అన్నారు. జిల్లాలో విద్యా, వైద్యం విషయంలో ముందడుగు వేశామని, 55 శాతం విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రమేష్‌గౌడ్, పెబ్బేరు జడ్పిటిసి ప్రకాష్, ఎంపిపి శంకర్‌నాయక్, మార్కెట్ ఛైర్మన్లు రవికుమార్, బుచ్చారెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ఉపముఖ్యమంత్రి మహిమూద్ అలీని మున్సిపల్ కౌన్సిలర్లు శాలువా, పూలమలలతో సన్మానించారు. అలాగే మైనార్టీ నేతలతో పాటు పార్టీ నాయకులు సన్మానించారు.