తెలంగాణ

కాంగ్రెస్‌కు పుట్టగతులుండవు: ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, అక్టోబర్ 11: గత మూడేళ్లుగా తెలంగాణలో సాధించిన అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేకనే కాంగ్రెస్ అవాస్తవ ఆరోపణలు చేస్తోం దని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. జనగామలో రూ. 45కోట్ల వ్యయంతో నిర్మించనున్న జిల్లా సమీకృత కార్యాలయ సముదాయ నిర్మాణ పనులకు బుధవారం డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షత వహించగా డిప్యూటీ సిఎం ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన 40 మాసాలలో చేసిన అభివృద్ధి పట్ల అన్ని వర్గాల ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా కేవలం జనగామ జిల్లాలోని 11 మండలాల్లో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి రైతుల్లో ఆనందాన్ని నింపుతున్నామని అన్నారు.
గతంలో నెర్రెలు బాసిన చెరువుకుంటలు గోదావరి నీటితో కళకళలాడుతున్నాయని అన్నారు. దేవాదుల మూడవ దశ పనులకు రూ. 6 వేల కోట్ల నిధుల మంజూరుకు పరిపాలన అనుమతి ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చారని అన్నారు. కరవు కాటకాలతో ఇబ్బందిపడిన జనగామ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సిఎం దృష్టికి తీసుకెళ్లగా మల్కాపూర్-లింగంపల్లి గ్రామాల మధ్య రూ. 4 వేల కోట్ల వ్యయంతో 10 టిఎంసిల నీటి సామర్థ్యం గల రిజర్వాయర్‌కు అనుమతించారని తెలిపారు. కెసిఆర్ మూడేళ్ల పాలనలో రైతులు ఏ ఒక్కచోట ధర్నాలు, రాస్తారోకోలు చేసిన దాఖలాలు కనిపించడం లేదన్నారు. రాష్ట్రం వస్తే కరెంట్ కష్టాలు వస్తాయని బె దిరించిన వారి దిమ్మతిరిగేలా ప్రస్తుతం వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తున్నామని అన్నారు. వచ్చే సంవత్సరం నుండి 24 గంటల కరెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని అన్నారు.
తమకు 9 గంటల కరెంట్ మాత్రమే సరిపోతుందని 24 గంటల విద్యుత్ అవసరమే లేదని రైతులు ఆందోళనకు దిగే పరిస్థితి వచ్చిందని, ఇదంతా కాం గ్రెస్ వారికి కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అన్ని కులాల వారికి పని కల్పించాలనే ఉద్దేశ్యంతో వృత్తులను కాపాడేందుకు ప్రభు త్వం కృషి చేస్తుంటే వారికి మింగుడు పడడం లేదని విమర్శించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డుపడడమే కాకుం డా రైతులకు ఎకరాకు సంవత్సరంలో రెండు పంటలకు రూ. 8 వేలు ఇచ్చేందుకు ప్రభు త్వం సిద్ధమవుతుంటే కాంగ్రెస్ నాయకులు గగ్గోలు పెడుతున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దలపద్మ నర్సింగరావు, ఎమ్మెల్యేలు దయాకర్‌రావు, తాటికొండ రాజయ్య, ఎంపిలు బూరనర్సయ్య, పసునూరి దయాకర్, కలెక్టర్ శ్రీదేవసేన, గిరిజన సహకార సంఘం రాష్ట్ర చైర్మన్ మోహన్‌గాంధీ నాయక్, లైబ్రరీ జిల్లా చైర్మన్ ఎడవెళ్లి కృష్ణారెడ్డిలతో పాటు జిల్లా పరిధిలోని వివిధ మండలాల జెడ్పీటిసిలు, ఎంపిపిలు పాల్గొన్నారు.