తెలంగాణ

జిల్లా వార్షికోత్సవ సభ గరంగరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘాటు విమర్శలతో సభ గందరగోళం
పోలీసులు, ప్రజాప్రతినిధుల మధ్య కోల్డ్‌వార్

గద్వాల, అక్టోబర్ 11: జోగుళాంబ గద్వాల జిల్లా ప్రథమ వార్షికోత్సవ సభ బుధవారం గరంగరంగా సాగింది. జిల్లా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ నిర్మాణానికి పిజెపి ఆవరణలో శంకుస్థాపన నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ముఖ్యఅతిధిగా హాజరైన సమావేశంలో గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, జడ్పీచైర్మన్ బండారి భాస్కర్ హాజరయ్యారు. అనంతరం బాలభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే డికె అరుణ సభాధ్యక్షతన ప్రారంభం కాగా, జ్యోతిప్రజ్వలన నిర్వహించారు. బాలభవన్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతుండగా, ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మైక్ తీసుకొని తనను కావాలని ఆహ్వానించి జిల్లా అధికార యంత్రాంగం అవమానపర్చిందని మండిపడ్డారు. ఎస్పీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకంలో తన పేరు ఉండగా, కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న శిలాఫలకంలో తన పేరు లేకపోవడంతో ప్రొటోకాల్‌ను విస్మరించారని, ఇందుకు సంబంధించిన అధికారి క్షమాపణ కోరుతూ వివరణ ఇవ్వాలని మంత్రి ఎదుట వాగ్వా దానికి దిగారు. అధికారులు, మంత్రి, ఎమ్మెల్యే సర్దిచెప్పినప్పటికీ సంపత్‌కుమార్ నిలబడి నిరసన వ్యక్తం చేయగా, కలెక్టర్ వేదికపైకి వచ్చి జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యేకు మాత్రమే ప్రొటోకాల్ ఉందని వివరించారు. ఇందుకు శాంతించని ఎమ్మెల్యే సంపత్ సభ నుండి బయటకు వెళ్లిపోయారు. కాంగ్రెస్ నాయకులు, జడ్పీ చైర్మన్, టిఆర్‌ఎస్ నాయకులు సంపత్‌కుమార్‌తో మాట్లాడి మిగతా జిల్లాలో పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేల పేర్లు ఉంటే తమ పేరు కూడా శిలాఫలకంపై వేయిస్తామని సర్దిచెప్పి వేదికపైకి తీసుకువచ్చారు. అనంతరం జరిగిన సమావేశం ఆద్యంతం ఉద్రిక్తతగా సాగింది. నేతల కౌంటర్లు, ఆరోపణల మధ్య సభ ముగిసింది. జిల్లా పోలీసు యంత్రాంగం, ప్రజాప్రతినిధులను గౌరవించకుండా ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, ఫ్రెండ్లీ పోలీసు దిశగా అడుగులు వేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, యువ అధికారుల కారణంగా జిల్లా సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూనే మరింత ముందుకు సాగాలని సూచించారు.
నిష్పక్షపాతంగా పనిచేయాలి : ఎమ్మెల్యే సంపత్
ఏడాదిన్నరపాటు ఎన్నో ఉద్యమాలు చేసిసాధించుకున్న జోగుళాంబ గద్వాల జిల్లాలో అధికార యంత్రాంగం నిష్పక్షపాతంగా పనిచేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అట్టడుగు స్థాయి వరకు తీసుకెళ్లినప్పుడే జిల్లా ఏర్పడినందుకు సార్ధకత ఉంటుందని అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అన్నారు. మొదటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శిలాఫలకాల్లో జిల్లాలోని ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లలో కూడా వివక్ష చూపించడం అధికారులకు తగదని హితవు పలికారు. ప్రొటోకాల్, జీవోలు పకడ్బందీగా అమలు చేస్తే తమకు అభ్యంతరం లేదని, ఎలాంటి ప్రొటోకాల్ లేని వారు వేదికలపైకి వచ్చి ఉపన్యాసాలు ఎలా చేస్తారో ప్రజలకు వివరించాలని చురకంటించారు. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరి గాం, ఈ మట్టిలోనే కలిసే నడిగడ్డ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటే సహించేది లేదన్నారు. జిల్లా అభివృద్ధి కోసం అధికారులకు సంపూర్ణంగా సహకరిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంపై రాజకీయ వివక్ష లేకుండా అభివృద్ధిని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.