తెలంగాణ

‘పట్టు’ కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏడుగురికి తీవ్ర గాయాలు
సహాయక చర్యలను
సమీక్షించిన కలెక్టర్ కణ్ణన్

ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి, అక్టోబర్ 11: పట్టు పరిశ్రమలో ఆధునిక మెళకువలపై అవగాహన కల్పించుకోవడానికి బయలుదేరిన రైతుల పాలిట రోడ్డు ప్రమాదం మృత్యుపాశమైంది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ క్రాస్ రోడ్డు వద్ద 65వ నం బరు జాతీయ రహదారిపైకి ఉదయం 6.30 గంటలకు చేరుకోగానే వెనుకనుండి అతివేగంగా వచ్చిన డిసిఎం వాహనం బలంగా ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ఓ రైతు అక్కడికక్కడే మృతి చెందగా, మరో రైతు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. వివరాల్లోకి వెళితే... జిల్లా కేంద్రమైన సిద్దిపేటలో జాతీయ పట్టు పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో పట్టు రైతులకు బుధవారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఉదయం 6 గంటలకు జహీరాబాద్ నుండి తుఫాన్ వాహనంలో బయలుదేరారు. తెల్లవారు జామునుండి ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తుండగా మల్కాపూర్ చౌరస్తా వద్దకు రాగానే తుఫాన్ వాహనం డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేసాడా? లేకా సంగారెడ్డి పట్టణంలోకి వాహనాన్ని మళ్లించడానికి వేగాన్ని తగ్గించాడా? తెలియదుకానీ వెనుకనుండి వస్తున్న డిసిఎం వాహనం ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. జహీరాబాద్ నుండి సిద్దిపేటకు వెళ్తున్న ఎపిడబ్ల్యూ 0829 తుఫాన్ వాహనాన్ని వెనుక నుండి డిసిఎం వాహనం బలంగా ఢీకొట్టడంతో జహీరాబాద్ మండలం శేఖాపూర్ గ్రామానికి చెందిన ఆసీఫ్ పాషా (40) అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన వారిని హైదరాబాద్‌కు తరలిస్తుండగా మునిపల్లి మండలం పెద్దచెల్మెడ గ్రామానికి చెందిన గడీల రాచయ్య (54) మార్గ మధ్యలో మరణించాడు. కృష్ణ, అజీమ్ అలీ, మహబూబ్ అలీ, జనార్దన్, ప్రేమ్‌కుమార్, ఖాజామైనోద్దీన్, మస్తాన్ అనే ఏడుగురు వ్యక్తులు తీవ్రగాయాలకు గురయ్యారు. జిల్లా కలెక్టర్ మానిక్కరాజ్ కణ్ణన్ కొండాపూర్ పోలీసులను అప్రమత్తం చేసారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే ప్రభాకర్‌కు కూడా కలెక్టర్ సమాచారం చేరవేసి క్షతగాత్రుల పరిస్థితిని వివరించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. కొండాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.