తెలంగాణ

కాలుష్య పరిశ్రమలపై చర్యలు కరువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేపపిల్లల మృతిపై సమగ్ర విచారణకు స్వస్తి
ఆరు లక్షల నష్ట పరిహారంతో సరిపెట్టిన అధికారులు
పటాన్‌చెరు, అక్టోబర్ 11: కాలుష్య కారక పరిశ్రమలపై చట్ట రీత్యా చర్యలు కరువైనాయి. కాలకూట విషం లాంటి కాలుష్య జలాలను ప్రజల మధ్యకు వదులుతూ వారి ప్రాణాలతో చెలగాట మాడుతున్న పరిశ్రమల యజమానులపై ఎలాంటి చర్యలకూ అధికారులు ఉపక్రమించలేదు. పటన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్ గ్రామ పంచాయతీ గండిగూడ గ్రామ శివారులలో గల గండిచెరువు నీటిలోకి రసాయన జలాలను వదిలిన వారిపై ఇప్పటి వరకు చట్టపరమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గండిచెరువులో లక్షలాది రూపాయల విలువ గల చేపపిల్లలు మృత్యువాత పడినా కఠినమైన చర్యలు కరువైనాయి. మత్స్యకారులకు ఆర్థికంగా సహకారం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం చేపలను చెరువులలో, కుంటలలో వదిలింది. అందులో భాగంగా గండిగూడ గ్రామ శివారులలో ఉన్న గండిచెరువు గత వారంలో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహీపాల్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున దాదాపు యాభై లక్షల రూపాయల విలువైన చేపపిల్లలను వదిలిపెట్టారు. అంతలోనే ఉపద్రవం ముంచుకొచ్చింది. మత్సకారుల ఆనందం ఎక్కువ కాలం నిలువకుండా ఆవిరైంది. నాలుగు రోజులు గడవక ముందే చేపలు విగతజీవులుగా మారి ఒడ్డుకు చేరాయి. గండిచెరువులోని నీటిలో కలిసిన కాలుష్య జలాలు సేవించి చేపలన్నీ మృత్యువాత పడ్డాయి. పటన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని జిన్నారం మండలం ఖాజిపల్లి, గడ్డపోతారం తదితర పారిశ్రామికవాడ ఈ చెరువుకు పై భాగంలో ఉంది. దీనితో ఆయా గ్రామాల పరిధిలో గల రసాయన పరిశ్రమల యజమానులకు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగుతోంది. విషంతో సమానమైన కలుషిత జలాలను నేరుగా గండిచెరువులోకి వదిలేస్తున్నారు అనే విమర్శలు ప్రజల నుండి వినిపిస్తున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పరిశ్రమలను ఆనుకుని గ్రామాల ప్రజలకు మరింత నష్టం వాటిల్లుతోంది. వ్యవసాయ భూములకు తీరని వ్యథ మిగులుతోంది.
వర్షపు నీటి ముసుగులో కాలుష్య జలాల వరద
వర్షం రాకతో వ్యవసాయదారులు పండుగ సంబరాలు జరుపుకోవడం సర్వ సాధారణం. కాని రసాయన పరిశ్రమలకు అసలు పండుగ వాతావరణం వర్షం రాకడతోనే వస్తోంది. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నప్పటికి ముమ్మాటికి ఇది నిజమని పలువురు గ్రామస్థులు కుండబద్ధలు కొట్టినట్లు చెపుతున్నారు. వర్షం పరిశ్రమల ప్రహరీ లోపల కురియగానే అంతకు ముందే ఆవరణలో ఏర్పాటు చేసిన అవుట్ లెట్ ద్వారా బయటికి రావాల్సి ఉంటుంది. చెరువులోకి, కుంటలు, కాల్వలలోకి విష పధార్థాలు యదేచ్ఛగా చేరుతున్నాయి. పరిశ్రమలలో ఉత్పత్తుల అనంతరము వెలువడుతున్న రసాయనాలు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం కాలుష్య శుద్ధి కర్మాగారానికి (ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంటుకు) పంపించాలి. కాని అందుకు విరుద్ధంగా ఆయా పరిశ్రమల యజమానులు వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు స్థానికంగా గుప్పు మంటున్నాయి. పటన్‌చెరు పట్టణ శివారులలో పోచారం గ్రామ ప్రధాన రహదారికి కుడి వైపున ఉన్న ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు పంపడం ద్వారా జరుగుతున్న కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు.
ఆరు లక్షల నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారు
మత్స్యకారులకు అవసరమైన ఆర్థిక సహాయ సహకారాలు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. అందులో భాగంగా వర్షాలతో నిండుకుండల్లా మారిన చెరువులు, కుంటలలో చేపపిల్లలను వదిలింది. సుమారు గండి చెరువులో యాబది లక్షల రూపాయల విలువ గల చేపలను వదిలినట్లు మత్స్యశాఖ అధికారులు రికార్డులను బట్టి అవగతమవుతోంది. భారీగా నిండిన గండిచెరువులోకి రసాయన పరిశ్రమల నుండి కాలుష్య జలాలు చేరాయి. చేపపిల్లలు మృత్యువాత పడ్డాక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు గండిచెరువును పరిశీలించారు. మరోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
దీనితో జరిగిన నష్టాన్ని అంచనా వేసిన అధికారులు కేవలం ఆరు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని మత్స్యకారులకు అందించారు. ఇంత భారీగా చేపలు మృతి చెందడానికి గల కారణాలు, కాలుష్య జలాలు గండి చెరువులోకి వదిలిన పరిశ్రమలపై వారు చర్యలకు ఉపక్రమించలేదని ప్రతిపక్షాలకు చెందిన నాయకులు విమర్శలకు దిగుతున్నారు. ఇక్కడి నుండి రసాయన పరిశ్రమను ఇతర ప్రాంతాలకు తరలిస్తామని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రకటించడం హాస్యాస్పదమని పటన్‌చెరు జడ్పీటిసి సభ్యుడు గడీల శ్రీకాంత్‌గౌడ్ విమర్శించారు. ప్రస్తుతం జరిగిన పరిమాణాలకు ఏ చర్యలు తీసుకుంటారో ముందుగా ప్రకటించాలని డిమాండు చేసారు