తెలంగాణ

గుంతలో పడి ముగ్గురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దామరచర్ల, అక్టోబర్ 11: గేదెలు కాసేందుకు వెళ్లిన ముగ్గురు బాలికలు ప్రమాదవశాత్తు గుంత లో పడి మునిగి చనిపోయిన సంఘటన బుధవా రం నల్లగొండ జిల్లా మండలంలోని వాచ్యాతండా గ్రామంలో చోటుచేసుకుంది. వాడపల్లి ఎస్‌ఐ రామన్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని వాచ్యాతండా గ్రామానికి చెందిన లావూరి రవి, సరోజ కుమార్తెలు లావూరి సంధ్య (12), లావూరి మం జుల (8), మరొక బాలిక లావూరి లింగా, వౌనికల కూతురు లావూరి మంజుల (12) పాడిగేదెలను మేపేందుకు పంటపొలాల్లో వెళ్లారు. మధ్యాహ్నం సమీపంలో ఉన్న బాప్లాకుంటలో నీరు తాగించేందుకు గేదెలను తరలించగా అవి కుంట లోపలికి వెళ్లాయి. వాటిని బయటకు తరలించేందుకు సంధ్య, మంజుల ప్రయత్నించగా ప్రమాదవశాత్తు కుంటలో మునిగిపోయారు. సాయంత్రం వరకు చిన్నారులు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఇరుగుపొరుగు వారిని అడిగారు. కుంట సమీపం లో చున్నీ పడి ఉండడంతో ఆ ప్రాంతంలో ఉన్న రైతులను అడగగా ఇద్దరు పిల్లలు ఈ ప్రాంతంలోనే గేదెలు మేపారని తెలిపారు. గ్రామస్థులు ఈ విషయాన్ని తెలుసుకుని కుంటలోకి వెళ్లి వెతకగా ముగ్గురు మృతదేహాలు లభ్యమయ్యాయి. లావూరి సంధ్య నకిరేకల్ సమీపంలోని గురుకుల ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతుండగా ఆమె చెల్లెలు లావూరి మంజుల వాచ్యాతండా గ్రామంలోని యుపిఎస్ పాఠశాలలో 3వ తరగతి చదువు తోంది. మరొక బాలిక లావూరి మంజుల అయిటిపాములలోని గురుకుల పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. ఒకే ఇంట్లోఇద్దరు చిన్నారులు మృతి, ఒకే ఇంట్లో అక్కాచెల్లెళ్లు మృతి చెందడంతో వారి తల్లిదండ్రుల రోదనలను ఆపలేకపోయారు. వారి రోదనలు చూసి గ్రామస్థులంతా కంటతడిపెట్టారు. ఒకేసారి ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. తండాలో విషాదఛాయలు:- ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు గుంటలో పడి మునిగిపోవడంతో వాచ్యాతండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ముగ్గురు చిన్నారులు గుంటలో పడి మృతి చెందడంతో గ్రామస్థులంతా మృతదేహాల వద్దకు వచ్చి కుటుంబ సభ్యుల రోదనలను చూసి వారు కూడా రోదించారు.