తెలంగాణ

21నుంచి నియోజకవర్గ సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఈ నెల 21 నుంచి 30 వరకు నిర్వహించాలని టిటిడిపి కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. దీంతో పాటు పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ, కంప్యూటరైజేషన్, గ్రామ, మండల, పురపాలక జిల్లా కమిటీలు, అనుబంధ సంఘాల ఏర్పాట్లు, కేంద్ర రాష్ట్ర కమిటీల బాధ్యుల విధులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో సమీక్ష నిర్వహించారు. గురువారం నాడిక్కడ ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన సమావేశంలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, పోలిట్‌బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ దీపావళి తర్వాత కార్య నిర్వాహక కార్యదర్శులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. నవంబర్ మొదటి వారంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు అధ్యక్షతన పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. తెలంగాణలో ఇప్పటి వరకు వౌళిక సదుపాయలు ఉన్నాయంటే అది టిడిపి పాలనలో చేపట్టినవేనని అన్నారు. సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీలపై నిలదీసినందుకు ప్రధాన కార్యదర్శి బొల్లం మల్లయ్య యాదవ్, రమేష్ రెడ్డిలను సూర్యాపేటలో ప్రభుత్వం హౌస్ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను డిసెంబర్‌లోగా అమలు చేయకపోతే ప్రభుత్వంపై పోరాటం తప్పదని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ములుగు గిరిజన బిడ్డ సీతక్కకు పోలిట్‌బ్యూరోలో స్ధానం లభించిందని, బడుగు వర్గాలకు ఇలాంటి అవకాశం ఒక్క తెలుగుదేశం పార్టీలోనే లభిస్తుందని అన్నారు. కేంద్రంలో కాంగ్రెసేతర పార్టీల పాలనకు ఎన్టీఆర్ పునాది వేశారని, ఆనాడు టిడిపి వేసిన పునాది వల్లే ఈ రోజు బిజెపి 282 సీట్లను గెలిచి నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారని అన్నారు. గులాబి చీడను తొలగించే బాధ్యత ప్రతి పసుపు కార్యకర్తపై ఉందని అన్నారు. భవిష్యత్ కార్యాచరణ పటిష్టంగా చేసుకుని పని చేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. పోలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ పాలనలో టిఆర్‌ఎస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని, టిడిపి కంటే ఏ పార్టీ పెద్దది కాదని అన్నారు.

చిత్రం.. ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన పార్టీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి నేత రమణ