తెలంగాణ

ఇఫ్లూకు ఇసి సభ్యుల నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: ఆంగ్లం-విదేశీ భాషల విశ్వవిద్యాలయం (ఇఫ్లూ) ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా ప్రొఫెసర్ కె వెంకటరెడ్డి, ప్రొఫెసర్ తపస్ రాయ్ నియమితులయ్యారు. విసి ప్రొఫెసర్ సురేష్‌కుమార్ వారికి నియామక పత్రాలను అందించారు. డిపార్టుమెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్‌లో వెంకటరెడ్డి పనిచేస్తుండగా, డిపార్టుమెంట్ ఆఫ్ లింగ్విస్టిక్స్ అండ్ ఫోనిటిక్స్‌లో ప్రొఫెసర్ తపస్ రాయ్ పనిచేస్తున్నారు.
యువజనోత్సవాలకు అయ్యప్ప
రష్యాలో జరిగే ప్రపంచ విద్యార్ధి యువజనోత్సవాలకు ఎబివిపి కార్యదర్శి అయ్యప్ప ఎంపికయ్యారు. ఈ సమావేశాలు 14వ తేదీ నుండి 24వ తేదీ వరకూ రష్యాలోని అద్దిలేర్‌లో జరుగుతాయని, ఇందులో 190 దేశాల విద్యార్థులు, యువకులు పాల్గొంటారని చెప్పారు. ప్రపంచంలోని వివిధ కళారూపాల ప్రదర్శన, వివిధ అంశాలపై, ప్రపంచ స్థితిగతులపై చర్చ జరుగుతుందని చెప్పారు.
పిజిటి మాథ్స్ ఫలితాలు విడుదల
తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ మాథ్స్, బయాలజీ పిజిటి పోస్టుల ఎంపిక జాబితాను ప్రకటించింది. 271 మంది అభ్యర్ధులను 1:2 నిష్పత్తిలో ఎంపిక చేశారు. వారందరికీ ఈ నెల 20వ తేదీ నుండి మాసాబ్‌ట్యాంక్ సాంకేతిక విద్యా భవన్‌లో సర్ట్ఫికేట్ల పరిశీలన జరగనుంది. కాగా కేటగిరి -4 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసిన వారు జిల్లాల ప్రాధాన్యతను ఖరారు చేసేందుకు ఈ నెల 15వ తేదీ వరకూ గడువు విధించినట్టు కమిషన్ పేర్కొంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఆ వివరాలను నవీకరించుకోవాలని సూచించింది.
కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో స్టెనో- టైపిస్టు పోస్టుల ప్రాధమిక జాబితాలను ప్రకటించినట్టు కమిషన్ అధికారులు తెలిపారు. అభ్యర్ధుల సర్ట్ఫికేట్లను ఈ నెల 21వ తేదీ నుండి పరిశీలిస్తామని వారు చెప్పారు. ఇతర వివరాలకు సర్వీసు కమిషన్ పోర్టల్‌ను సందర్శించాలని వారు తెలిపారు.
కొరియా రాయబారిగా చుక్కపల్లి సురేష్
కొరియా రిపబ్లిక్‌కు హైదరాబాద్ రాయబారిగా చుక్కపల్లి సురేష్ నియమితులైనట్టు కేంద్ర విదేశాంగ శాఖ డిసిపి మనోజ్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలను ఆయన పరిశీలిస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
రైతులకు పరిహారం
కాలుష్య పరిశ్రమల కారణంగా ఇటీవల గండిగూడెం చెరువులో చనిపోయిన చేపలకు పరిహారం ఇస్తున్నట్టు తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు పేర్కొంది. చేపలను పెంచిన రైతులకు 1.03 కోట్ల రూపాయలు చెల్లించినట్టు బోర్డు అధికారులు తెలిపారు. అదేవిధంగా సంగారెడ్డి గడ్డపోతారం అయ్యమ్మ చెరువులో చేపలకు కూడా 40వేల రూపాయలు పరిహారం ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. కాగా కాలుష్యానికి కారణమైన 29 పరిశ్రమలకు నోటీసులు ఇచ్చి తాత్కాలికంగా మూసివేసినట్టు అధికారులు పేర్కొన్నారు. పరిశ్రమల యాజమాన్యాలకు షోకాజ్‌లు ఇచ్చామని వారు చెప్పారు.
ఓటర్ల గల్లంతుపై బిజెపి ఫిర్యాదు
వివిధ ప్రాంతాల్లో ఓటర్ల పేర్లు జాబితాల నుండి గల్లంతయ్యాయని బిజెపి ప్రతినిధి బృందం ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. జి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు తదితరులు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కలిసి ఒక వినతి పత్రం ఇచ్చారు. ఇష్టానుసారం ఓటర్ల జాబితా నుండి ఓట్లను తొలగించారని, పరిశీలన సక్రమంగా జరగలేదని వారు పేర్కొన్నారు.