తెలంగాణ

ఉగ్రవాదులకు స్మగ్లింగే ప్రధాన ఆర్థిక వనరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: దేశ వ్యాప్తంగా జరుగుతున్న స్మగ్లింగ్‌లో బంగారం, పొగాకు ఉత్పత్తులు, నార్కొటిక్ డ్రగ్సే ప్రధానంగా కనిపిస్తోంది. దేశంలో ఉన్న ఉగ్రవాద గ్రూపులు వీటినే ప్రధాన ఆదాయ వనరుగా చేసుకుని తమ నేరపూరిత కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. బంగారం, పొగాకు ఉత్పత్తులు, నార్కొటిక్ డ్రగ్స్‌ను నకిలివీ సృష్టించి వాటిని స్మగ్లింగ్ చేయడం ద్వారా పెద్దఎత్తున నగదు సమీకరించుకుని తద్వారా ఉగ్రవాద, నేరపూరిత కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఫిక్కీ (ఎఫ్‌ఐసిసిఐ) సంస్థ తనలో భాగమైన ‘కమిటీ అగైనెస్ట్ స్మగ్లింగ్ అండ్ కౌంటర్‌ఫీట్ యాక్టివిటీస్ డిస్ట్రోయింగ్ ద ఎకనామి-సిఏఎస్‌సిఏడిఈ) కేస్‌కేడ్, కెపిఎంజి 2017 నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. 2016 గణాంకాల ప్రకారం ఉగ్రవాద ప్రభావిత దేశాల్లో ప్రధమ, ద్వితీయ స్థానాల్లో ఇరాక్, ఆఫ్ఘానిస్తాన్ ఉండగా, మూడో స్ధానంలో భారత్ ఉంది. యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ క్రైం ప్రివెన్షన్ అండ్ క్రిమినల్ జస్టిస్ నివేదిక ప్రకారం కౌంటర్‌ఫీటింగ్ (నకిలీ) ఉత్పాదన స్మగ్లింగ్ అనేది ఉగ్రవాదులకు రెండో అతిపెద్ద ఆదాయ వనరుగా వెల్లడించిందని ఫిక్కీ, కెపిఎంజి నివేదికలో స్పష్టం చేసిందని ఆయా వర్గాలు వెల్లడించాయి. అక్రమ వ్యాపారం అనేది రోజు రోజుకీ విస్తరించుకుంటూ పోవడం ద్వారా ఉగ్రవాదులు తమ ఆదాయాన్ని పెంచుకుంటూ పోతున్నారు. కొందరు చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ కౌంటర్‌పీట్‌కు వ్యతిరేకంగా తమ విధులను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. అటువంటి వారిని ఘనంగా సన్మానించి ‘యాంటీ కౌంటర్‌ఫీటింగ్, యాంటీ స్మగ్లింగ్ ’ అవార్డులను ప్రదానం చేసేందుకు ఫిక్కీ కేస్‌కేడ్ భావిస్తోంది.