తెలంగాణ

ప్రజా రక్షణలో పోలీస్ కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: దేశ రక్షణ కోసం పోలీసులు తమ ప్రాణాలు త్యాగం చేస్తున్నారని, దేశ భద్రత, ప్రజారక్షణలో పోలీసుల పాత్ర కీలకమని తెలంగాణ రాష్ట్ర డైర్టెర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మ అన్నారు. గురువారం హైదరాబాద్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈనెల 15న హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో జరిగే పోలీస్ రన్‌కు సంబంధించి టీ షర్టు, మెడల్స్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిజిపి అనురాగ్‌శర్మ మాట్లాడుతూ, ఈనెల 21న అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2కె, 5కె, 10కె రన్‌ను నిర్వహించనున్నట్టు తెలిపారు. పరుగు పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి మెడల్ ఇవ్వడం జరుగుతుందన్నారు. 2014 గౌహతిలో నిర్వహించిన డిజిపిల సమావేశంలో ప్రధాన మంత్రి మాట్లాడుతూ పోలీస్ త్యాగాలకు గుర్తింపులేదని, వివిధ కార్యక్రమాలు, పలు సందర్భాల్లో ప్రజలకు తెలియజేయాలని సూచించారన్నారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వెబ్‌సైట్లో పోలీస్ సిబ్బంది చేసిన మంచి కార్యక్రమాలను అన్ని రాష్ట్రాల పోలీస్ శాఖలు అప్‌లోడ్ చేయడం జరుగుతుందన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఎటువంటి పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారో ప్రజలకు అవగాహనక కల్పించాలని డిజిపి తెలిపారు. గత సంవత్సరం రాష్ట్రంలో వివిధ పోలీస్ సంస్థలు, పారా మిలిటరీతో కలిసి పోలీస్ సిబ్బంది ఉపయోగించే ఆయుధాలు, పరికరాల ప్రదర్శన నిర్వహించడం జరిగిందని, దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. ప్రజలకు అవగాహన కల్పించే విషయాల్లో అంతర్జాతీయ సరిహద్దులలో భద్రత కోసం వివిధ పోలీస్ సంస్థల సిబ్బంది విధులు నిర్వహిస్తారని, అంతేకాకుండా దేశ అంతర్గత భద్రత కోసం పోలీస్ అన్ని సమయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమాలలో భాగంగా పోలీస్ అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ నిర్వహిస్తున్న 2వ పోలీస్ రన్‌కు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. పోలీస్ అమరుల కుటుంబాలకు ప్రజలు అండగా ఉంటారని చెప్పేందుకే ఈ రన్‌లు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈరన్‌లో పాల్గొనాలని డిజిపి కోరారు. ఈరన్‌ను నిర్వహణకు ఎస్‌ఎల్‌ఎస్ టెర్మినస్ ఎడి ఎస్‌పి రెడ్డి రూ. 5లక్షల చెక్కును డిజిపికి అందించారు.

చిత్రం..మీడియా సమావేశంలో మాట్లాడుతున్న డిజిపి అనురాగ్ శర్మ, నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి