తెలంగాణ

రూ.275.42 కోట్ల కేంద్ర నిధులతో మూడు పర్యాటక ప్రాజెక్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ,రాష్ట్ర ప్రాయోజిత నిధులతో మూడు పర్యాటక ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. రూ.275.42 కోట్ల వ్యయంతో చేపట్టే ప్రాజెక్టులను పూర్తి చేసి పర్యాటకంగా మరో ముందడుగు వేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకు గాను ప్రపంచ పర్యాక దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రచార కార్యక్రమం ‘పర్యాటన్ పర్వ’ ఉత్సవాన్ని ఈ నెల 13న పెద్ద ఎత్తున చేపట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ‘సమర్థవంతమైన పర్యాటకం అభివృద్ధికి ఒక సాధనం’ వంటిదనే సందేశాన్ని ఇస్తూ కేంద్రం పర్యాటన్ పర్వ పేరుతో గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్ర పర్యాటక శాఖలతో కలిసి ఉత్సవాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కూడా భవిష్యత్‌లో చేపట్టబోయే ప్రాజెక్టుల ప్రాచుర్యాన్ని వివరిస్తూ పెద్ద ఎత్తున పర్యాటక ఉత్సవాలను ప్రజల్లోకి తీసుకువెళుతోంది. కేంద్ర నిధులతో చేపట్టే ప్రాజెక్టుల వివరాలు ఇలా ఉన్నాయి. రూ.91.62 కోట్ల వ్యయంతో మహబూబ్‌నగర్ జిల్లాలో ఇకో-టూరిజం సర్క్యూట్, వరంగల్ జిల్లాలో రూ.84.40 కోట్ల వ్యయంతో ట్రైబల్ సర్క్యూట్, రూ.99.42 కోట్ల వ్యయంతో హైదరాబాద్ హెరిటేజ్ సర్క్యూట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పర్యాటక రంగ ఆసక్తిని తెలియజేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది హైదరాబాద్ వేదికగా ఆరు అంతర్జాతీయ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఎంఐసిఈ, మెడికల్ అండ్ హెరిటేజ్ టూరిజం హబ్‌గా ఉన్న హైదరాబాద్ పర్యాటకంగా మరింత ముందుకెళ్లేందుకు ఈ ఏడాది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని తారామతి బారాదరిలో ఈ నెల 13న ఉదయం 10 గంటలకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు పర్యాటక శాఖ వెల్లడించింది. కొత్త రాష్టమ్రైనా ఇప్పటి వరకు 8 జాతీయ పర్యాటక అవార్డులను సొంతం చేసుకోగా, 11 రోడ్ షోలను గత ఏడాది నిర్వహించింది. ఈ ఏడాది పర్యాటక దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ టూరిజంపై సమగ్ర పుస్తకాన్నీ, పర్యాటక చిత్రోత్సవాన్ని ఆవిష్కరించడంతో పాటు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అవార్డులను ప్రదానం చేయనుంది.