తెలంగాణ

డాక్టర్ నూరుద్దీన్‌కు ఐసిఎంఆర్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలోని బయోటెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నూరుద్దీన్ ఖాన్‌కు ఐసిఎంఆర్ అవార్డు దక్కింది. న్యూఢిల్లీలో 11వ తేదీన జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఐసిఎంఆర్ శకుంతల అమిర్ చంద్ ప్రైజ్‌ను, ఐసిఎంఆర్ చతుర్వేది కళావతి జగన్మోహన్ దాస్ స్మారక అవార్డును అందుకున్నారు.
సతీష్ చందర్‌కు తాపీ ధర్మారావు పురస్కారం
కవి, విమర్శకుడు, పత్రికా సంపాదకుడు సతీష్‌చందర్‌కు ప్రతిష్ఠాత్మక తాపీ ధర్మారావు పురస్కారాన్ని ఈ నెల 15వ తేదీన ఇవ్వనున్నట్టు తాపీధర్మారావు వేదిక నిర్వాహకుడు డాక్టర్ సామల రమేష్ బాబు హైదరాబాద్‌లో చెప్పారు. సైఫాబాద్ టెలిఫోన్ భవన్ పక్కనే ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ అండ్ కామర్స్ కాలేజీలో ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో అవార్డు అందిస్తామని అన్నారు. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె రామచంద్రమూర్తి, తెలుగు వర్శిటీ విసి ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, తెలంగాణ సాహితీ అకాడమి అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, ఏటుకూరి ప్రసాద్, విమలాసోహన్ తదితరులు పాల్గొంటారని ఆయన చెప్పారు.
అశోకా వర్శిటీలో ప్రవేశాలు ప్రారంభం
హర్యానా సోనిపట్‌లోని అశోకా యూనివర్శిటీ డిగ్రీ అడ్మిషన్లను ప్రారంభించింది. అక్టోబర్ 11 నుండి మరో బ్యాచ్ అడ్మిషన్లు చేపడుతున్నామని, అదే విధంగా 2018 విద్యాసంవత్సరానికి కూడా అడ్మిషన్లు ప్రారంభించామని వర్శిటీ ఒక ప్రకటనలో తెలిపింది.