తెలంగాణ

ప్రపంచ తెలుగు మహాసభలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: ప్రపంచ తెలుగు మహాసభల కోసం రాష్ట్రానికి తరలివస్తున్న అతిథులకు చేయాల్సిన ఏర్పాట్లపై ఉన్నత స్ధాయి సమావేశం శుక్రవారం సమీక్షించింది. ఈ సమావేశంలో కోర్ కమిటీ సభ్యులైన ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కెవి రమణాచారి, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత, తెలుగు సాహిత్య అకాడమి అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డి, పర్యాటక శాఖ కార్యదర్శి బి వెంకటేశం తదితరులు హాజరయ్యారు. హైదరాబాద్ నగరంలతో పాటు జిల్లా కేంద్రాల్లో తెలుగు సాహిత్యం, కవితలు పద్యాలను హోర్డింగ్‌ల ద్వారా ప్రదర్శించి తగిన ప్రచారం నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. రైళ్లలో, బస్సులకు ప్రచారం చేయడం, ప్రపంచ తెలుగు మహాసభల లోగోను స్టికరింగ్ చేసి తగిన ప్రచారం నిర్వహించాలని కోర్ కమిటీ నిర్ణయం తీసుకుంది. త్వరలో వివిధ పత్రికల సంపాదకులతో ఈ అంశంపై చర్చించాలని నిర్ణణయించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రాచీన శాసనాలు, చారిత్రక, వారసత్వ కట్టడాల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కోర్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహాసభలకు ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ముఖ్య్లును ఆహ్వానించడంపై చర్చ జరిగింది. ఇతర దేశాధినేతలు, ఇతర రాష్ట్రాల ప్రముఖులను ఆహ్వానించడంపై కూడా చర్చించారు. ముఖాముఖి చర్చలు, వేదికలపైన నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లు, ప్రచురించాల్సిన ప్రచురణలు, సాహిత్య ప్రక్రియలపై ప్రధానంగా చర్చ జరిగింది. తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఎస్‌వి సత్యనారాయణ, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షులు డాక్టర్ ఆయాచితం శ్రీ్ధర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.