తెలంగాణ

పౌరసరఫరాల భవన్‌లో వాట్సాప్ సెంటర్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: పౌరసరఫరాల శాఖలో ఎలాంటి అవాంతరం వచ్చినా, అక్రమాలు జరిగినా నేరుగా వాట్సప్ ద్వారా సమాచారాన్ని ఎవరైనా పంపించేందుకు వీలుగా పౌరసరఫరాల భవన్‌లో వాట్స్‌ప్ సెంటర్‌ను శుక్రవారం ప్రారంభించారు. పౌరసరఫరాల శాఖ వాట్సప్ నెం.7330774444కు సమాచారాన్ని, ఫోటోలతో సహా పంపించవచ్చు. ఈ సెంటర్‌ను ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌరసరఫరాల శాఖలోని కిందిస్థాయి సిబ్బంది అవినీతి, అక్రమాలు, సరఫరా నుంచి పంపిణీ వరకు నిత్యావసర సరుకులు పక్కదారి పట్టే అంశాలు, రేషన్ దుకాణాలు సకాలంలో తెరవకపోయినా, సరుకులు సరఫరా చేయకపోయినా, తూకంలోతేడాలు, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడ్డా, ఈ-పాస్ యంత్రాలు పని చేయకపోయినా పైన పేర్కొన్న నెంబర్ ద్వారా వాట్సప్ కంట్రోల్ రూంకు సమాచారాన్ని అందించవచ్చని తెలిపారు. పౌరసరఫరాల శాఖకు సంబంధించిన 171 ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్ద 1715 సిసి కెమెరాలను దశల వారీగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటి స్వరూపంలో పెనుమార్పులు తీసుకురావడం జరిగిందని, ప్రైవేటు సంస్థలకు ధీటుగా ప్రభుత్వ ఐటి శాఖ పని చేస్తోందని అన్నారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడుతూ సాంకేతికత, పారదర్శకత, జవాబుదారీతనం విషయంలో పౌరసరఫరాల శాఖ మరో ముందడుగు వేసిందని అన్నారు. పౌరసరఫరా శాఖ సంస్థ, కేంద్ర కార్యాలయానికి, జిల్లాలకు మధ్య క్షేత్ర స్థాయిలో ఉన్న సమన్వయ లోపాన్ని వాట్సప్ గ్రూప్‌ల ద్వారా తగ్గించడం జరిగిందని చెప్పారు. గత ఫిబ్రవరిలో హైదరాబాద్‌లోని 9 గోదాముల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశాని, మగిలిన అన్నిచోట్ల దశలవారీగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కెమెరాలు జాయింట్ కలెక్టర్ కార్యాలయాలకు అనుసంధానం చేయబడతాయని, అక్కడ జెసిలు గోదాముల్లో ఏం జరుగుతోందనేది వీడియో వాల్‌పై ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 30 రోజుల పాటు సిసికెమెరాల రికార్డింగ్ అందుబాటులో ఉంటుందని అన్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.