తెలంగాణ

కన్నుల పండువగా.. పర్యాటక దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: కన్నుల పండువగా ప్రపంచ పర్యాటక దినోత్సవం శుక్రవారం జరిగింది. చారిత్రాత్మక తారామతి బారాదరి ప్రాంగణం వేదిక అయ్యింది. రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కె. స్వామి గౌడ్ ఉత్సవాన్ని ప్రారంభించారు. రాష్ట్ర సాంస్కృతిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి రమణా చారి, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్థి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ప్రభుత్వ కార్యదర్శి బి. వెంకటేశం సభకు అధ్యక్షత వహించారు. తెలంగాణ పర్యాటక ప్రాంతాలపై రూపొందించిన సమగ్ర పుస్తకాన్ని, పర్యాటక చిత్రాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలు ఉత్తమ పర్యాటక అవార్డులను ప్రదానం చేశారు.ఎకో టూరిజం విస్తరణలో భాగంగా ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో కొత్త పర్యాటక ప్రదేశం అందుబాటులోకి వచ్చింది. అటవీ శాఖ అధికారుల చొరవతో నల్లమల్ల అటవీ అందాలు, కృష్ణా తీర సొగసులు లోయల అందాలను తిలకించేందుకు వీలుగా అక్టోపస్ వ్యూ పాయింట్ ఏర్పాటైంది.

చిత్రం..శుక్రవారం హైదరాబాద్‌లో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని
జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న మండలి చైర్మన్ స్వామిగౌడ్