తెలంగాణ

మంజీరకు వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, అక్టోబర్ 13: సింగూర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో మహారాష్ట్ర, కర్నాటకతో పాటు సంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మంజీర నదికి వరదతాకిడి పెరుగుతోంది. గత యేడాది మాదిరిగానే ఈ సారి కూడా సింగూర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి వస్తున్న నీటిని దిగువన ఉన్న ఘన్‌పూర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు వదిలిపెడుతున్నారు.
ఎగువ నుంచి 22 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా మూడు గేట్లను మీటరున్నర పైకెత్తి 24 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో మంజీర నది పరవళ్లు తొక్కుతోంది. గత యేడాది మాదిరిగానే ఈ సారి కూడా తెలంగాణాలో ప్రసిద్ద పుణ్య క్షేత్రాల్లో ఒకటైన ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. నాలుగైదు రోజులుగా అమ్మవారి నిజరూప దర్శనం నిలిచిపోయింది. శుక్రవారం ఏడుపాయల ప్రాంతంలో ఉన్న ఓ చెక్ డ్యాం వద్దకు వెళ్లిన ఇద్దరు యువకులు నీటి మద్యలో చిక్కుకుపోయారు. ఇది గమనించిన ఆలయం అధికారులు, ఆలయ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో తాళ్ల సహాయంతో ఇద్దరు యువకులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంతో ఊపిరి పీల్చుకున్నారు. సింగూర్ ప్రాజెక్టు గేట్లు పూర్తిగా మూసివేసే వరకు అమ్మవారి ఆలయంలో నిత్య పూజలు నిలిచిపోనున్నాయి. క్రితం సారి ఎన్నడు లేని విధంగా 40 రోజుల పాటు ఏడుపాయల అమ్మవారికి నిత్య పూజలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దేవి శరన్నవరాత్రి వేడుకలు సైతం ఉత్సవ విగ్రహాల ద్వారానే నిర్వహించారు. ఈ సారి శరన్నవరాత్రి వేడుకలు ముందుగానే పూర్తి కావడం, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సింగూర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుకోవడంతో అదనపు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రాబోయే రబీ సీజన్‌లో కూడా గత యేడాది మాదిరిగానే సింగూర్ కాలువలతో పాటు ఘన్‌పూర్ ఆనకట్ట ఆయకట్టు పరిధిలో వేలాది ఎకరాల్లో వరి సాగు కావడం ఖాయమని చెప్పవచ్చు. మరిన్ని వర్షాలు కురిసే సూచనలు మెం డుగా కనిపిస్తున్నారు.

చిత్రం.. సింగూర్ గ్రామ శివారులోని ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తి
దిగువకు విడుదల చేస్తున్న నీటితో పరవళ్లు తొక్కుతున్న మంజీర నది