తెలంగాణ

కెసిఆర్ దార్శనికతకు నిదర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, అక్టోబర్ 13: తెలంగాణ సమగ్రాభివృద్ధిలో సిఎం కెసిఆర్ దార్శనికతకు కాళేశ్వరం నుండి మూసీ ప్రాజెక్టు మీదుగా సాగర్ ఎడమకాలువ ఆయకట్టుకు గోదావరి నీరందించే కొత్త పథకం గొప్ప నిదర్శనంగా నిలుస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు.
శుక్రవారం నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాగర్ ఎడమకాలువ పరిధిలో జిల్లా ఆయకట్టుకు ఏటా ఎదురవుతున్న నీటి ఎద్దడి నివారణకు సిఎం కెసిఆర్ ముందుచూపుతో గోదావరి నీళ్లను సాగర్ ఆయకట్టుకు అందించే పథకాన్ని ప్రతిపాదించారన్నారు. గతంలో ఎవరూ ఊహించని రీతిలో మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుండి ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని బస్వాపురం, గంథమల్ల రిజర్వాయర్ల కాలువల ద్వారా మూసీ ప్రాజెక్టుకు కాళేశ్వరం నీరందించి ఇక్కడి నుండి 30కిలోమీటర్లు పానగల్ వాగు వరకు కాలువ నిర్మించి పెద్దదేవులపల్లి రిజర్వాయర్ నుండి సాగర్ ఆయకట్టులో రెండు పంటలు నీరిందించే గొప్ప పథకాన్ని కెసిఆర్ చేపట్టబోతున్నారన్నారు. తెలంగాణకు జీవగడ్డయైన మేడిగడ్డ నుండి గోదావరి జలాలు తెలంగాణ జిల్లాల్లో పారించేందుకు కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారన్నారు. కాళేశ్వరంతో యాదాద్రి భువనగిరితో పాటు సూర్యాపేట, నల్లగొండలకు గోదావరి నీటి వసతి అందుతుందన్నారు. సాగర్ ఆయకట్టు నియోజకవర్గాల్లో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు లేకపోయినా రాజకీయాలకు అతీతంగా కెసిఆర్ తెలంగాణ ప్రతి ఊరు నాదే అనుకుంటూ తెలంగాణలోని 10వేల గ్రామాలన్నింటి అభివృద్ధిని కోరుకుంటున్నారన్నారు. అందుకే వెనుకబడిన నల్లగొండ, సూర్యాపేట జిల్లాల అభివృద్ధికి రెండు మెడికల్ కళాశాలలు కెసిఆర్ మంజూరు చేశారని సూర్యాపేట సభ నుండి తిరిగి వెళుతూ కూడా తనకు వెంటనే ఆ కళాశాలల ఏర్పాటుకు స్థలాలు చూడాలని చెప్పారన్నారు. మెడికల్ కళాశాల ఏర్పాటుతో ఐదువేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. శ్రీశైలం నుండి వస్తున్న నీటి శాతం మేరకు సాగర్ ఆయకట్టులో పంటల సాగుకు నీటి విడుదలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
అభివృద్ధిని అడ్డుకునేందుకే బంద్
ప్రతిపక్షాలు రాష్ట్రంలో, సూర్యాపేట జిల్లాలో కూడా అభివృద్ధి నిరోధక శక్తులుగా మారాయని మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ప్రతిపక్షాలు సూర్యాపేట జిల్లా బంద్ నిర్వహించడం ద్వారా టిఆర్‌ఎస్ చేపట్టిన అభివృద్ధిపై తమ అక్కసు వెళ్లగక్కుతూ తమ ఫ్యూడల్ బుద్ధిని చాటుకున్నాయన్నారు. కాంగ్రెస్ దామోదర్‌రెడ్డి, టిడిపి పటేల్ రమేష్‌రెడ్డి, బిజెపి సంకినేని వెంకటేశ్వర్‌రావులు ఆరవై ఏళ్లుగా రాజకీయ ఘర్షణలతో ప్రజల జీవితాలతో ఆడుకుని ఘోరీలు, స్థూపాలు, భూకబ్జాలే మిగిల్చారని విమర్శించారు. ఇప్పుడు సూర్యాపేటలో కూడా తమ ఫ్యూడల్, రౌడీ రాజకీయాలు సాగించాలని చూస్తున్నారన్నారు. ప్రతిపక్షాల సూర్యాపేట బంద్ ప్రభుత్వం పేటను జిల్లాగా చేసినందుకా, కలెక్టరేట్ భవనం శంకుస్థాపన చేసినందుకా, మెడికల్ కళాశాల, 400కెవి సబ్ స్టేషన్ ఇచ్చినందుకా అంటూ జగదీష్‌రెడ్డి నిలదీశారు. తనకు పేటలో భూమి లేదని ఉన్నభూములన్నీ ప్రతిపక్ష నాయకులవేనని వాళ్లు భూమి ఇస్తే వారి భూముల్లోనే కలెక్టరేట్ కట్టించేందుకు తాను సిద్ధమని, భూములిచ్చేందుకు వారు సిద్ధమేనా అంటు ఆయన సవాల్ చేశారు. నల్లగొండ పార్లమెం టు ఉప ఎన్నికపై జగదీష్‌రెడ్డి స్పందిస్తూ ఎంపిగా గుత్తా పదవిలో ఉన్నారని ఖాళీ అయితే ఉప ఎన్నికను ఎదుర్కొంటామన్నారు. ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో రెండు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. అలాగే కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా కరువు పీడిత దేవరకొండ నియోజకవర్గం తాగునీటి అవసరాలకు డిండి రిజర్వాయర్ నింపేందుకు సీఎం కెసిఆర్ ఆదేశాలివ్వడం హర్షణీయమన్నారు.

చిత్రం..నల్లగొండలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జగదీష్‌రెడ్డి, ఎంపి గుత్తా