తెలంగాణ

30జిల్లాలకూ మత్స్య సహకార సొసైటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: కొత్తగా ఏర్పడిన జిల్లాలతో కలుపుకుని మొత్తం 30 జిల్లాలకూ మత్స్య సహకార సొసైటీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంత్రి తలసాని సోమవారం తన ఛాంబర్‌లో 2వ విడత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంపై మత్స్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ మత్స్య సహకార సొసైటీల్లో చేపల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల్లోని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ సభ్యత్వం కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వ్యయం చేసి ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నందున, అర్హులందరికీ లబ్ది చేకూరేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. గతంలో 10 జిల్లాలకే మత్స్య సహకార సొసైటీలు ఉండేవని, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన జిల్లాలకూ సొసైటీలు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. 2017-18 సంవత్సరంలో రాష్ట్రంలోని 24,831 నీటి వనరులలో 68 కోట్ల 32 లక్షల చేప పిల్లలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 6,537 నీటి వనరులలో 29 కోట్ల 52 లక్షల విడుదల చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం 11,605 నీటి వనరులలోకి మాత్రమే సరిపడ నీరు చేరిందని, ఇందుకు 44 కోట్ల 17 లక్షల చేప పిల్లలు అవసరం అవుతాయని అన్నారు. చేప పిల్లల సరఫరాదారులతో సమన్వయం చేసుకుని సకాలంలో చేప పిల్లలు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని సూచించారు. ఇంకా ఈ సమావేశంలో మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ, డిప్యూటీ డైరెక్టర్లు శ్రీనివాస్, రవికుమార్ పాల్గొన్నారు.

చిత్రం..సోమవారం సచివాలయంలో మత్స్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్న మంత్రి తలసాని