తెలంగాణ

హైదరాబాద్‌లో ఆర్టీఏ అధికారుల తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: అక్రమ రవాణా, కాలం చెల్లిన బస్సులు, వాహనాల ఫిట్‌నెస్‌పై ఆర్టీఏ అధికారులు దృష్టి సారించారు. సోమవారం నగరశివారులో తనిఖీలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కిషన్‌గూడ వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని 10 ప్రైవేటు బస్సులపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా నాలుగు బస్సులను అధికారులు సీజ్ చేశారు. మోటారు వాహన చట్టం ప్రకారం, నిబంధనలకు వ్యతిరేకంగా బస్సులు నడిపిస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్టీఏ అధికారులు హెచ్చరించారు. ఈ తనిఖీలు నగరశివారులోనే కాకుండా రాష్టవ్య్రాప్తంగా కొనసాగుతాయని ఆర్టీఏ అధికారులు తెలిపారు. పరిశ్రమలు, విద్యాసంస్థల వాహనాలు సామర్థ్యంతో కూడిన ఫిట్‌నెస్ కలిగివుండాలని, లేనిపక్షంలో భారీ జరిమానాతోపాటు వాహనాలను సీజ్ చేయాల్సి వస్తుందని ఆర్టీఏ అధికారులు హెచ్చరించారు.