తెలంగాణ

అమర పోలీసుల త్యాగం చిరస్మరణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: దేశ భద్రత, ప్రజారక్షణలో అమరులైన పోలీసుల త్యాగం చిరస్మరణీయమని తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతోపాటు ప్రకృతీ వైపరీత్యాలు, విపత్తు సమయాల్లో ముందుండి సేవలందించిన అమర పోలీసుల సేవలను ఆయన శ్లాఘించారు. సోమవారం పోలీస్ సంస్మరణ దినోత్సవంలో భాగంగా ఎల్‌బి స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆయుధాల ప్రదర్శన ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. జాతి నిర్మాణానికి, రాష్ట్ర అభివృద్ధికి యువకులు పోలీసులకు సహకరించాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, విపత్తుల సమయాల్లో, ట్రాఫిక్ ప్రమాదాలు సంభవించినప్పుడు మనల్ని కాపాడేది పోలీసులేనని, వారి సేవలను ప్రజలకు తెలియజేప్పేందుకు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మ, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పోలీస్ అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా 2కే, 5కే, 10కే రన్‌లను చేపట్టడం అభినందనీయమన్నారు. అమర పోలీసులను స్మరిస్తూ నిర్వహించిన వ్యాస రచన పోటీలు, రక్తదాన శిబిరాలు, ఆయుధాల ప్రదర్శనకు మంచి స్పందన లభించిందన్నారు. ప్రతి యేటా పోలీస్ అమరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రాజీవ్ త్రివేదితోపాటు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఎం మహేందర్‌రెడ్డి, ఆర్‌బివిఆర్‌ఆర్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ జితేందర్, అదనపు డిజిలు గోపికృష్ణ, అంజనీకుమార్, రవిగుప్త, గోవింద్ సింగ్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ పూర్ణచంద్రరావు, సౌమ్యమిశ్రా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో మొత్తం 21 స్టాళ్లను ఏర్పాటు చేయగా, అసోం, కేరళ, ఉత్తరప్రదేశ్, మహారాష్టక్రు చెందిన పోలీస్ బలగాలతోపాటు ఆక్టోపస్, బిఎస్‌ఎఫ్, సిఆర్‌పిఎఫ్, గ్రేహౌండ్స్ విభాగాల దళాలు కూడా పాల్గొన్నాయి.