తెలంగాణ

వెటర్నరీ విద్యార్థులకు పెరిగిన స్టైపెండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: పి వి నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థుల ఇస్తున్న స్టైపెండ్‌ను ప్రభుత్వం పెంచింది. అండర్ గ్రాడ్యుయేషన్ (బివిఎస్‌సి, బిటెక్) ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ప్రస్తుతం నెలకు 7000 రూపాయలు స్టైపెండ్‌గా చెల్లిస్తుండగా, దీన్ని 7900 రూపాయలకు పెంచారు. ఎంవిఎస్‌సి (్ఫస్టియర్, సెకండియర్) విద్యార్థులకు ప్రస్తుతం నెలకు 9000 రూపాయలు చెల్లిస్తుండగా, దీన్ని 10100 రూపాయలకు పెంచారు. పిహెచ్‌డి (మూడేళ్లు) విద్యార్థులకు ప్రస్తుతం నెలకు 10,000 రూపాయలు చెల్లిస్తుండగా, దీన్ని 11,200 రూపాయలకు పెంచారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ సూచనల మేరకు స్టైపెండ్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు పశుసంవర్థక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్ చందా పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.