తెలంగాణ

అటవీ భూముల సంరక్షణ అధ్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే, అటవీ భూముల సంరక్షణ అద్భుతంగా ఉందని పశ్చిమ బెంగాల్ కర్సియాంగ్ అటవీ అకాడమీలో శిక్షణలో ఉన్న ఫారెస్ట్ రేంజ్ అధికారులు అన్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి 38 మంది శిక్షణలో ఉన్న ఫారెస్ట్ రేంజ్ అధికారులు హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా వారు సోమవారం దూలపల్లిలోని అటవీ అకాడమీని, అరణ్య భవన్‌ను సందర్శించారు. తెలంగాణకు హరిత హారంలో భాగంగా ఎఎన్‌ఆర్, ఎఆర్ ఫ్లాంటేషన్లను మేడ్చల్, రంగారెడ్డి జిల్లా చూపించారు. ఆ తర్వాత అరణ్య భవన్‌లో రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారులుతో వారు సమావేశమయ్యారు. హరితహారంలో నాటిన మొక్కలు, రక్షణకు చేపట్టిన విధానాల గురించి వారు రాష్ట్ర అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ అటవీ శాఖ ఉన్నతాధికారులను వారు అభినందించారు.