తెలంగాణ

ఆత్మహత్యల కేసులో కొత్తకోణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మృతుల ఒంటిపై నగలు ఉన్నాయి
సెల్‌ఫోన్లు మాయమయ్యాయి
ఐదుగురి మృతికేసు దర్యాప్తు ముమ్మరం
ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో సోదాలు..
కాల్ డేటా సేకరణలో పోలీసులు
ప్రభాకర్‌రెడ్డి ఎవరితోనూ
మాట్లాడేవాడు కాదు: ఇంటి యజమాని

హైదరాబాద్, అక్టోబర్ 18: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొల్లూరు ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలో జరిగిన ఆత్మహత్యల కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. ప్రభాకర్‌రెడ్డి సహ మృతులందరి ఒంటిపై బంగారు నగలు యథావిధిగా ఉండగా, సెల్‌ఫోన్లు మాత్రం మాయమైనట్టు పోలీసులు గుర్తించారు. కాగా మృతదేహాల వద్ద బంగారు నగలు అలాగే ఉండి..సెల్‌ఫోన్లు కనిపించకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రామంచంద్రాపురం, అశోక్‌నగర్‌కు చెందిన ప్రభాకర్ రెడ్డి కుటుంబం డిండి ప్రాజెక్టు చూసేందుకు వెళ్తున్నామని చెప్పి మంగళవారం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలోని చెట్లపొదల్లో అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ముగ్గురి మృతదేహాలు ఒక చోట, ఇద్దరి మృతదేహాలు మరోచోట లభించడంతో ఐదుగురి ఆత్మహత్య కేసు మిస్టరీగా మారింది. ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సెల్‌ఫోన్ల డేటా బయటికి రాకూడదనే ఉద్దేశ్యంతో ప్రభాకర్‌కరెడ్డి ఫోన్లు మాయం చేశాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. తొలుత ముగ్గురికి విషంతో కలిపిన కేక్, కూల్‌డ్రింక్స్ తాగించిన తరువాతే..ప్రభాకర్ రెడ్డి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో వెళ్లి తాను ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల సెల్‌ఫోన్ నెంబర్ల ఆధారంగా కాల్ రికార్డ్సు, టవర్ లొకేషన్ ఆధారాలను పోలీసులు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
అదేవిధంగా రాంచంద్రాపురం, అశోక్‌నగర్‌లోని ప్రభాకర్‌రెడ్డి కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంట్లోకి ఎవరినీ అనుమతించకుండా మృతుడు ప్రభాకర్‌రెడ్డికి చెందిన ల్యాప్‌టాప్‌ను, పడకగదిలోని ప్రతి కాగితాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు. అదేవిధంగా ఇంటి యజమానిని కూడా విచారిస్తున్నారు. ప్రభాకర్‌రెడ్డి ఎవరితోనూ మాట్లాడేవాడు కాదని ఇంటి యజమాని మధుసూదన్ పోలీసులకు తెలిపారు.

పత్తికొనుగోలుకు ప్రత్యేక ప్రణాళిక

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 18: తెలంగాణ ప్రభుత్వం రైతుల నుండి పత్తి కొనుగోలు చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రణాళిక అమలు కోసం వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి బుధవారం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. రైతుల నుండి పత్తి కొనుగోలు చేసేందుకు 143 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని పార్థసారథి ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితిలో రైతులు తొందరపడి పత్తిని అమ్మవద్దని, కాస్త వేచి చూడాలని రైతులకు సలహా ఇచ్చారు. మార్కెట్ బలపడుతుందని, కనీస మద్దతు ధర కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఇస్తుందని వెల్లడించారు. రైతులు పత్తిని ఆరబెట్టి తేమ శాతం 8 నుండి 12 శాతం మధ్య మాత్రమే ఉండేలా చూసి మార్కెట్‌కు తేవాలని సూచించారు. సిసిఐకి పత్తిని విక్రయించేందుకు బస్తాల్లో తీసుకురావద్దని, విడిగా (లూజ్) గానే మార్కెట్‌కు తేవాలన్నారు. బస్తాల్లో పత్తి తీసుకు వస్తే బస్త్ధారను సిసిఐ చెల్లించేందుకు ప్రస్తుతం ఉన్న నిబంధనలు అంగీకరించడం లేదన్నారు.
పత్తి రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని, పేర్లు నమోదు చేసుకున్న రైతులకు వారంరోజుల్లో గుర్తింపు కార్డులు ఇస్తామని పార్థసారథి తెలిపారు. సిసిఐ కొనుగోలు కేంద్రాల్లో రైతులను గుర్తించేందుకు సాఫ్ట్‌వేర్ లోడింగ్ జరుగుతోందని, ఈ కార్యక్రమం ఈ నెల 23 వరకు పూర్తవుతుందని వెల్లడించారు. గుర్తింపు కార్డులు లేని రైతులు ఆధార్ కార్డు లేదా బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకువస్తే, సిసిఐ సిబ్బంది వారి నుండి పత్తి కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.

ఒక్కో రిక్రూట్‌మెంట్‌కు ఒక్కో రూల్

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 18: రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తున్న టీచర్సు రిక్రూట్‌మెంట్‌లో స్పెషల్ ఎడ్యుకేటర్లు అర్హులు కారని పేర్కొనడంపై విద్యానిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తెలంగాణ సర్వ శిక్షా అభియాన్ విడుదల చేసిన ఉత్తర్వులు జీవో 28 ప్రకారం సహిత విద్య పూర్తి చేసిన వారికి డిఎస్సీలో అవకాశం కల్పించారు. కాని తాజాగా ఉపాధ్యాయుల ఎంపికకు జారీ చేసిన జీవో 25 ద్వారా నిర్వహించబోతున్న టీచర్సు రిక్రూట్‌మెంట్ టెస్టులో మాత్రం వీరి ప్రస్తావన లేకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. 2008 తర్వాత జరిగిన అన్ని డిఎస్సీల్లో సహిత విద్య పూర్తి చేసిన వారికి అవకాశం కల్పించారని చివరికి టెట్‌లోనూ వారిని అనుమతించారని, గురుకుల పరీక్షల్లోనూ వీరిని అనుమతించి తాజా రిక్రూట్‌మెంట్‌లో మాత్రం పక్కన పెట్టడం ఏమిటని అభ్యర్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా జీవోలో ప్రత్యేక విద్యకు అర్హత ఉన్నట్టు పేర్కొనలేదని, దీంతో ఈ విద్య అభ్యసించిన విదాయర్ధులంతా మానసికంగా ఆందోళన చెందుతున్నారని అన్నారు. 932 స్పెషల్ టీచర్ పోస్టులను సైతం ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాలని నేషనల్ కన్వీనర్ కల్పగిరి కోరారు. విద్యాహక్కు చట్టంలోనూ, ఇతర జీవోల్లో ఇందుకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నా ప్రభుత్వం స్పెషల్ ఎడ్యుకేటర్లను పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.