తెలంగాణ

విడి భాగాల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: నగర శివార్లలో ఏర్పాటు చేయనున్న ప్రెపిషన్ ఇంజనీరింగ్ (విడి భాగాల తయారీ) పార్కు కోసం భూ సేకరణ ప్రక్రియను వెంటనే చేపట్టాలని రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి, వౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టిఎస్-ఐఐసి) చైర్మన్ గ్యాదరి బాలమల్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్ పార్కు ఏర్పాటుకు మేడ్చల్ జిల్లా, ఘట్‌కేసర్ మండలం మాదారంలో 300 ఎకరాలను ఎంపిక చేసినట్లు ఆయన వివరించారు. బుధవారం చైర్మన్ గ్యాదరి బాలమల్లు తన ఛాంబర్‌లో టిఎస్-ఐఐసి భూ సేకరణ డిప్యూటీ కలెక్టర్ శివకుమార్, కాప్రా చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమల యజమానుల సమాఖ్య ప్రతినిధులతో పార్కు ఏర్పాటు కోసం భూ సేకరణ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్ బాలమల్లు కాప్రా చిన్నతరహా పరిశ్రమల యజమానుల కోసం ప్రత్యేకంగా ప్రెపిష న్ ఇంజనీరింగ్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నగర శివార్లలో ప్రెపిష న్ ఇంజనీరింగ్ పార్కును ఏర్పాటు చేసిన తర్వాత హైదరాబాద్ నగర శివార్లలో కొనసాగుతున్న ప్రెపిష న్ ఇంజనీరింగ్ పరిశ్రమలను ఈ పార్కులోకి తరలిస్తామన్నారు. ప్రెపిష న్ పరిశ్రమల యజమానుల కోరిక మేరకు మేడ్చల్ జిల్లా, ఘట్‌కేసర్ మండలం మాదారంలో సర్వే నెంబర్ 225లో ఎంపిక చేసిన 299 ఎకరాల భూముల్లో ప్రెపిష న్ ఇంజనీరింగ్ పార్కును ఏర్పాటు చేయాలని కార్యాచరణ రూపొందించినట్లు చైర్మన్ బాలమల్లు తెలిపారు.