తెలంగాణ

పాలన... ప్రక్షాళన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలీసు రేంజ్‌ల తరహాలో రెవెన్యూ రేంజ్‌లు ప్రతి మూడు జిల్లాలకు ఒకటి చొప్పున ఏర్పాటు
ఇన్‌చార్జిలుగా ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శులు సంస్కరణలకు శ్రీకారం చుడుతున్న సర్కారు

హైదరాబాద్, అక్టోబర్ 18: తెలంగాణ అవతరించిన మూడేళ్లలోపే కొత్తగా 21 జిల్లాలను ఏర్పాటు చేసి పాలన రంగంలో సంస్కరణలు తెచ్చిన సిఎం కెసిఆర్ మరో ముందడుగు వేయనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు విజయవంతమైంది. అలాగే రాష్ట్రంలో భూమి రికార్డుల సర్వే పనులు వేగవంతమయ్యాయి. డిసెంబర్ 31లోపల పనులు పూర్తవుతాయి. ప్రస్తుతం పోలీసు శాఖకే పరిమితమైన రేంజి విభాగాన్ని రెవెన్యూ శాఖకు కూడా విస్తరించనున్నారు. ప్రజలకు సుపరిపాలనను సత్వరమే అందించే లక్ష్యంతో రాష్ట్రంలో కొత్తగా 11 రెవెన్యూ రేంజిలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. ప్రతి రేంజి పరిధిలో మూడు నుంచి నాలుగు జిల్లాలు ఉంటాయి. పాత జిల్లాలు ప్రాతిపదికగా రెవెన్యూ రేంజి ఏర్పాటయ్యే అవకాశాలు లేకపోలేదు. ప్రతి రేంజికి ఇన్‌చార్జీలుగా ప్రభుత్వ ప్రధాన ప్రత్యేక కార్యదర్శులను నియమిస్తారు. వీరు జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు పరిపాలన రంగంలో మార్గ నిర్దేశనం చేస్తారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, వ్యవసాయ రంగంలో రైతులకు అందించనున్న సబ్సిడీలు, 24 గంటల పాటు వ్యవసాయానికివిద్యుత్ తదితర అంశాలను రేంజి స్ధాయిలో సమీక్షిస్తారని సమాచారం. రాష్ట్రంలో కొత్తగా 21 జిల్లాలు ఏర్పాటై సంవత్సరమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 31 జిల్లాలు, 584 మండలాలు, 68 రెవెన్యూ డివిజన్లు, 10,966 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. రాష్ట్రంలో అక్షరాస్యత 66.46 శాతం మేరకు ఉంది. 1,12,077 చ.కిమీ విస్తీర్ణంలో 3.50కోట్ల జనాభాతో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ రేంజిలను ఏర్పాటు చేయడం వల్ల దిగువ స్ధాయిలో పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయా లేదా అనే విషయమై స్క్రూటినీ చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. రెవెన్యూ రేంజిల ఏర్పాటుకు సంబంధించిన ఫైలు దాదాపు సిద్ధమైంది. ముఖ్యమంత్రి ఈ అంశంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. తాస్హిల్దార్, ఆర్‌డివో, జాయింట్ కలెక్టర్లు, కలెక్టర్లకు మధ్య సమన్వయం, వీరికి, ప్రభుత్వానికి మధ్య వారథిగా రెవెన్యూ రేంజిలు ఉపయోగపడుతాయి. పరిపాలన వికేంద్రీకరణకు కూడా రెవెన్యూ రేంజిలు దోహదపడుతాయని ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీరామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే పాలనా రంగంలో మార్పులు వచ్చాయి. అప్పట్లో మండలాలను ఏర్పాటు చేశారు. మర్రి చెన్నారెడ్డి హయాంలో రంగారెడ్డి జిల్లా అవతరించింది. దాదాపు 36 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జిల్లాల పునర్విభజన కార్యక్రమమం దిగ్విజయంగా అమలైంది. ఇటీవలనే కొత్త జిల్లా కలెక్టరేట్లకు నిధులు విడుదల చేసి నూతన భవనాల నిర్మాణం నిమిత్తం శంకుస్థాపన చేశారు.