తెలంగాణ

మాటలే తప్ప, చేతల్లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: ముఖ్యమంత్రి మాటలే తప్ప, చేతల్లో రాష్ట్ర అభివృద్ధికి చేసిందేమీ లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. రానున్న శాసనసభ సమావేశాల్లో ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. శుక్రవారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తెలంగాణ వచ్చి మూడున్నర సంవత్సరాలు అయిందని, తెలంగాణ అభివృద్ధి లక్ష్యాల సాధనలో తెరాస ఘోరంగా విఫలమైందని అన్నారు. నీళ్లు, నిథులు, నియామకాలు బిజెపితోనే సాధ్యమని, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడానికి బిజెపి పెద్ద ఎత్తున సమాయత్తం అవుతోందని పేర్కొన్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో మంచిర్యాలలో జరిగే బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ప్రణాళిక రూపొందిస్తామని పేర్కొన్నారు. వివిధ పార్టీల నుండి అనేక మంది సీనియర్ నాయకులు, ఎన్‌ఆర్‌ఐలు బిజెపిలో చేరబోతున్నారని, నరేంద్రమోదీ తమ పార్టీకి బాహుబలి అని, స్టార్ కాంపైనర్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర లక్ష్యాలను పూర్తి చేస్తామని, గుడ్ గవర్నెన్స్‌ను అందిస్తామని చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న పోరా టం గుడ్ గవర్నెన్స్‌కు, బ్యాడ్ గవర్నెన్స్‌కు పోరాటమని అన్నారు. తెరాస బ్యాడ్ గవర్నెన్స్‌కు చిహ్నమని అన్నారు. వ్యక్తిగత స్వార్ధం కోసం కొందరు తెలంగాంలో జరుగుతున్న ఈ పోరాటాన్ని వ్యక్తుల మధ్య జరుగుతున్న పోరుగా మారుస్తున్నారని, ఇది వ్యక్తుల మధ్య పోరుకాదని, వ్యవస్థల మధ్య పోరు అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని కొంత మంది భుజానికి ఎత్తుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని వారు భుజానికి ఎత్తుకుంటున్నారని నిలదీశారు. కాంగ్రెస్ తప్పిదాల వల్లనే తెలంగాణ ఉద్య మం వచ్చిందని, చరిత్రను ఎవరూ మరిచిపోరని అన్నారు. ఆదర్శ్ కుంభకోణం, బోఫోర్స్ కుంభకోణం, కోల్ కుంభకోణం ఇలా ఎన్నో కుంభకోణాలను ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్ పాలన అవినీతి, వారసత్వ కుటుంబపాలనగా మారిందని, కాంగ్రెస్‌కు, టిఆర్‌ఎస్‌కు తేడా ఏం లేదని ఎద్దేవా చేశారు. బిజెపి మతతత్వ పార్టీ అని కాంగ్రెస్ ఇన్‌చార్జి కుంతియా మాట్లాడటం దారుణమని, దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని ఆయన అన్నారు. ఈ సమావేశం లో రాష్ట్ర ప్రధానకార్యదర్శులు చింతా సాంబమూర్తి, గంగిడి మనోహర్‌రెడ్డి, కార్యదర్శి పి పాపారావు, అధికార ప్రతినిధులు ఎన్ వి సుభాష్, ఎ రాకేష్‌రెడ్డి, సుధాకర్ శర్మ వజ్జ, దాసరి మల్లేశం తదితరులున్నారు.
చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న లక్ష్మణ్