తెలంగాణ

విచారణను ఎదుర్కొంటున్న 18 ఆస్పత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: భద్రత ప్రమాణాలు, నిబంధనలు పాటించని 18 హాస్పిటళ్లపై కేసులు నమోదు చేయడంతో ఆయా హాస్పిటల్ యాజమాన్యాలు ప్రాసిక్యూషన్ ఎదుర్కొంటున్నాయి. నిబంధనలు పాటించనట్లు తేలిన హాస్పిటళ్లపై రూ.10 వేల వరకు జరిమానా విధిస్తున్నారు. ఇటీవల జరిగిన హాస్పిటళ్ల ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర అగ్నిమాపక శాఖ హాస్పిటళ్లపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తత్ర తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించకుండా, భద్రత ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోకుండా రోగులకు చికిత్స అందిస్తున్నట్లు తేలితే నోటీసులు జారీ చేశారు. ఇందుకు సరైన కారణాలు చూపితే జరిమాన విధించి సక్రమంగా మార్పులు చేర్పులు చేయాలని సూచిస్తున్నారు. హాస్పిటళ్ల యాజమాన్యాలు స్పందించకపోతే ప్రాసిక్యూషన్ నోటీసులు జారీ చేస్తున్నారు. అంతేకాకుండా అన్ని రకాల నిబంధనలు పాటించి ఉంటేనే అభ్యంతరం లేదన్న సర్ట్ఫికెట్ (ఎన్‌ఓసి) జారీ చేస్తున్నారు, లేదంటే తిరస్కరిస్తున్నారు. తాజా సమాచారం మేరకు 71 హాస్పిటళ్లకు ఎన్‌ఓసిలను జారీ చేసి, మరో 21 మందికి ప్రాసిక్యూషన్ నోటీసులు జారీ చేసింది. హాస్పిటళ్లను నాలుగైదు అంతస్తుల్లో నిర్మించడం వల్ల అగ్నిప్రమాదం జరిగినప్పుడు అత్యవసరంగా తప్పించుకునేందుకు వీలు లేకుండా నిబంధనలను గాలికొదిలిన హాస్పిటళ్లు కొన్నింటిని గుర్తించి వారికి ఎన్‌ఓసిలను తిరస్కరించింది. వీటిలో కొన్ని ప్రముఖ హాస్పిటళ్లు ఉండగా, ప్రభుత్వరంగ సంస్థ హాస్పిటళ్లు ఒకటి రెండు ఉండడం గమనార్హం. హాస్పిటళ్ల నిర్మాణంలో చుట్టూ ఉండాల్సిన ఖాళీ స్ధలం లేకపోవడం, అనుమతించిన అంతస్తుల కన్నా అధికంగా నిర్మించడం వంటి తప్పిదాలు చాలా మంది చేస్తున్నారు. ఇంకా అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు సరిగ్గా చేయకపోవడం, అత్యాధునిక అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకోకపోవడం వంటివి జరుగుతున్నాయి. వీటిపై దృష్టిసారించిన అగ్నిమాపక శాఖ ఇక నుంచి భద్రత ప్రమాణాలు ఉంటేనే అనుమతించడం లేదంటే తిరస్కరిస్తామని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.