తెలంగాణ

కాళేశ్వరం, భగీరథలకు సహకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: తాగు, సాగు నీటి ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యతా పథకాలుగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నందున వాటి పూర్తి కోసం అన్ని రకాలుగా సహకారం అందించాలని అటవీ శాఖ ఉన్నతాధికారులు కింది స్థాయి అధికారులకు, సిబ్బందికి సూచించారు. అటవీ అనుమతుల్లో జాప్యం వల్లే ఆయా ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం జరుగుతోందన్న పేరు తమ శాఖకు రావద్దని వారు తెలిపారు. కాళేశ్వరం, సీతారామ, మిషఊన్ భగీరథ ప్రాజెక్టుల పురోగతి, అటవీ భూముల అనుమతులకు సంబంధించిన అంశాలపై శుక్రవారం సచివాలయంలో సుదీర్ఘ సమీక్షా సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల అటవీ అధికారులతో తాజా పరిస్థితిపై ఉన్నతాధికారులు సమీక్షించారు. కంపా నిధుల వినియోగం జిల్లాల వారీగా పరిస్థితిపై కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు.