తెలంగాణ

స్వామి రామానందతీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్‌లో గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: హైదరాబాద్‌లోని స్వామి రామానంద తీర్ధ రూరల్ ఇన్‌స్టిట్యూట్‌లో తెలంగాణలోని గ్రామీణ యువతకు నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఉపాధి కల్పించేందుకు ఎనిమిది కోర్సులను ఆఫర్ చేస్తున్నట్లు డైరెక్టర్ ఎన్ కిషోర్ రెడ్డి తెలిపారు. ఆటోమొబైల్ సర్వీసింగ్‌లో మూడు నెలలు, ఎలక్ట్రానిక్ వస్తువుల రిపైర్, మెయింటెనెన్స్‌లో మూడు నెలలు, ఎలక్ట్రీషియన్‌గా నాలుగు నెలలు, టిడిపి, ప్రింట్ పబ్లిషింగ్ అసిస్టెంట్‌గా మూడు నెలలు, ఎకౌంట్స్ అసిస్టెంట్ ట్యాలీలో మూడు నెలలు, కంప్యూటర్ హార్డ్‌వేర్ అసిస్టెంట్‌గా మూడు నెలలు, సోలార్ సిస్టమ్ సర్వీసులో, టైలరింగ్ మెషిన్ ఆపరేటర్‌గా మూడు నెలల శిక్షణ ఇస్తారు. పూర్తి వివరాలకు భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జలాల్‌పూర్ గ్రామంలోని స్వామి రామానంద తీర్ధ గ్రామీణ సంస్ధకు ఒరిజనల్ సర్ట్ఫికేట్లు, జిరాక్స్‌సెట్, పాస్‌పోర్టు ఫోటో, ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో వచ్చే నెల 1వ తేదీన హాజరు కావాలి. పూర్తి వివరాలు, విద్యార్హతలకు సంబంధించి 9133908222ను సంప్రదించాలని లేదా జిల్లా డిఆర్‌డిఏ కార్యాలయంలో జాబ్ డిస్ట్రిక్ట్ మేనేజర్‌ను కలవాలని డైరెక్టర్ తెలిపారు.