తెలంగాణ

కాళేశ్వరంలో గవర్నర్ తల్లి అస్తికల నిమజ్జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాదేవపూర్, అక్టోబర్ 21: ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తన తల్లి దివంగత విజయలక్ష్మి అస్తికలను జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంనకు చేరుకున్నారు. ఇక్కడి త్రివేణి సంగమ నదీ ప్రాంతంలో తన తల్లి అస్తికలను ఆయన నిమజ్జనం చేశారు. కాళేశ్వరం గోదావరి నదీ ప్రాంతంలో ప్రత్యేక టెంట్లు వేశారు. ఇవతలి తీర ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరం చేరుకున్న గవర్నర్‌కు కాళేశ్వర ముక్తీశ్వరస్వామి వారి అర్చకులు, పురోహితులు లాంఛనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన నేరుగా ప్రత్యేకంగా గోదావరి నదీ తీరంలో ఏర్పాటుచేసిన టెంటు కింద తన తల్లి అస్తికలను, పిండ ప్రదాన కార్యక్రమాలను నిర్వహించారు. బోటులో ప్రయాణించి త్రివేణి సంగమ నదీ స్థలంలో తన తల్లి అస్తికలను నిమజ్జనం చేశారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు వెళ్ళారు. కలెక్టర్ ఆకునూరి మురళి, పెద్దపల్లి ఇన్‌చార్జి కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సంయుక్త కలెక్టర్ అమయ్‌కుమార్, ఎస్పీ ఆర్ భాస్కరన్, రామగుండం పోలీసు కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్, మంథని శాసనసభ్యుడు పుట్ట మధూకర్ తదితరులు పాల్గొన్నారు.