తెలంగాణ

రామప్ప పరిరక్షణకు పిల్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రామప్ప దేవాలయం పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోలేదని, ఈ దేవాలయం స్ధితిపై పత్రికల్లో వచ్చిన వార్తలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి నవీన్‌రావుప్రధానన్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ లేఖను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పిల్ కమిటీ న్యాయమూర్తికి రెఫర్ చేశారు. ఈ కేసును రిజిస్ట్రీలో నమోదు చేసి విచరణకు తేదీని ఖరారు చేయాల్సిందిగా ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాలంపేట గ్రామ పరిధిలో ఉన్న రామప్ప దేవాలయం గొప్ప చారిత్రక కట్టడమని, ప్రపంచ హెరిటైజ్ స్ధలాలకు ఎంట్రీగా కూడా నామినేట్ అయిందన్నారు. ఆర్కియాలజికల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ దేవాలయం ఉందని న్యాయమూర్తి లేఖలో పేర్కొన్నారు. కాని ఈ ఆలయ సంరక్షణ చర్యలు బాగాలేవని వచ్చిన వార్త కథనాలను ఆయన హైకోర్టుకు పంపారు. అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ లేఖను పరిశీలించి పిల్ కమిటీకి నివేదించాలని ఆదేశించారు.