తెలంగాణ

ఎగ్జిబిషన్ సొసైటీలో అవకతవకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ నుంచి బకాయిలు వసూలు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినా అమలు చేయలేనందుకు కోర్టు ధిక్కారం కింద రాష్ట్ర అగ్నిమాపక శాఖ డిజి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ షామీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం ఈ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన ఖాజా అజాజుద్దీన్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఉన్నతాధికారులతో పాటు సొసైటీ సెక్రటరీ ఆదిత్య మార్గం, జిల్లా అగ్నిమాపక శాఖాధికారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. అగ్నిమాపక శాఖకు సొసైటీ దాదాపు రూ.90 లక్షల మేర బకాయిలు ఉందన్నారు. హైకోర్టు ఈ బకాయిలు వసూలు చేయాలని ఆదేశించినా, ఇంతవరకు అధికారులు అమలు చేయలేకపోయారన్నారు. సొసైటీ ఇంతవరకు కేవలం రూ.40 లక్షలు చెల్లించిందన్నారు. కాగా హైకోర్టు ధర్మాసనం ఈ విషయమై నోటీసులు జారీ చేసి మూడు వారాలు గడువు ఇచ్చి కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ఆదేశించింది.