తెలంగాణ

సాగర్ ఎడమ కాల్వకు గోదావరి జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, అక్టోబర్ 22: నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి కృష్ణాజలాలు రాకున్నా త్వరలో గోదావరి జలాలను మళ్లించి సాగర్ ఎడమకాల్వకు రెండు పంటలకు నీరందించనున్నట్లు రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. టిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితుడైన సోమా భరత్‌కుమార్‌కు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని టిఎన్‌ఆర్ గార్డెన్ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన అభినందన సభలో మంత్రి ముఖ్య అతిధిగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 4 వేల టిఎంసిల గోదావరి నీళ్లు వృధా అవుతున్నాయని, ఆ జలాలను మళ్లించి తెలంగాణాను సస్యశ్యామలం చేయనున్నట్లు తెలిపారు. గోదావరి జలాలను త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌లో కలిపేవిధంగా కాల్వలను నిర్మించనున్నట్లు తెలిపారు. దీంతో నాగార్జునసాగర్ ఎడమకాల్వ ఆయకట్టు ప్రాం తంలో రెండు పంటలకు నీరందించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నారని అన్నారు. వ్యవసాయరంగంపై 60 శాతం మంది ఆధారపడి జీవిస్తున్నారని, వ్యవసాయరంగాన్ని బతికించి లాభసాటి చేయాలన్నదే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమని ఆయన అన్నారు. తెలంగాణలో ఉన్న అన్ని వనరులను వినియోగించి వ్యవసాయాన్ని బతికించనున్నట్లు తెలిపారు. వ్యవసాయానికి అవసరమైన నీరు, పెట్టుబడి, పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుందన్నారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఒక్క ఎకరం భూమి కూడా వృధాగా ఉండకుండా నీరందించే చర్య లు చేపడుతున్నట్లు తెలిపారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టును నిర్మించకుండా ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయని, కానీ త్వరలో తెలంగాణ ప్రజలకు జీవనాధారం కాబోతుందని ఆయన అన్నారు. గత ప్రభుత్వాల తప్పిదాల వల్లనే తెలంగాణలోని ఎడమకాల్వకు రైతులకు నష్టం జరుగుతోందని, ఆల్మట్టి, నారాయణ్‌పూర్ ప్రాజెక్టుల ఎత్తుపెంచినప్పుడు అడ్డుకోకపోవడమే కారణమన్నారు. ఇక పార్టీ కోసం పనిచేసిన వారందరినీ గుర్తిం చి పదవులు ఇస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం జరిగిన ఉద్యమంలో కష్టించి పనిచేసిన ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని, అందరికీ కెసిఆర్ న్యాయం చేస్తారన్నారు. ఉద్యమంలో ఎలా భాగస్వాములైనారో అదేవిధంగా పార్టీలో, ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండాలన్నదే కెసిఆర్ ఆలోచన అని అన్నా రు. ఎమ్మెల్యే భాస్కర్‌రావు మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్టీని పటిష్టపరిచి రానున్న ఎన్నికల్లో 12 స్థానాల్లో టిఆర్‌ఎస్ జెండాను ఎగురవేసేలా కృషిచేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. దామరచర్ల మండలంలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ ప్లాంట్ కోసం సేకరించిన 4 వేల ఎకరాల భూమిలోని 2 వేల ఎకరాల్లో డ్రైపోర్ట్ నిర్మించాలని ఆయన కోరారు. సన్మాన గ్రహీత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమా భరత్‌కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల పాలనలో రూ.35 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. 21.9 శాతం అభివృద్ధిని సాధించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఒక్కటేనని అన్నారు. తనపై నమ్మకం ఉంచి పదవిని ఇచ్చినందుకు తన బాధ్యతలను చిత్తశుద్ధితో పనిచేసి పార్టీని అభివృద్ధి చేస్తానన్నారు. తిరునగరు మారుతిరావు అధ్యక్షతన జరిగిన సన్మాసభలో మున్సిపల్ చైర్‌పర్సన్ తిరునగరు నాగలక్ష్మీభార్గవ్, మాజీ ఎమ్మెల్యేలు తిప్పన విజయసింహారెడ్డి, రేపాల శ్రీనివాస్, నోముల నర్సింహయ్య, రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కర్నాటి రమేశ్, వేములపల్లి ఎంపిపి నామిరెడ్డి రవీనాకర్నాకర్‌రెడ్డి, నాయకులు రాంచందర్‌నాయక్, తిరునగరు భార్గవ, పెద్ది శ్రీనివాస్‌గౌడ్, యడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, గార్లపాటి ధనమల్లయ్య, గౌరు వెంకటేశ్వర్లు, వీరకోటిరెడ్డి, ఎంసి.కోటిరెడ్డి, నాగార్జునాచారి పాల్గొన్నారు.

చిత్రం..అభినందన సభలో మాట్లాడుతున్న మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి